Telugu Global
NEWS

చంద్రబాబు ఓడిపోతే ఏం చేస్తారు?

ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు రావడానికి మరో పన్నెండు రోజులు మిగిలి ఉంది. రాజకీయ నాయకులందరూ లెక్కల మాస్టర్లు అయిపోయారు. ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తామే రాజులమని, తామే మంత్రులమంటూ ఊహా లోకాల్లో తేలిపోతూ ఉన్నారు. ఒకే ఒక్క రాజకీయ నాయకుడు, దేశంలోకెల్లా అందరికంటే సీనియర్ అని చెప్పుకుంటున్న నేత ఆలోచనలు మాత్రం మరో విధంగా ఉన్నాయి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓడిపోతే కర్తవ్యం ఏంటని ఆ సీనియర్ నాయకుడు మదన పడుతున్నారని సమాచారం. అంత […]

చంద్రబాబు ఓడిపోతే ఏం చేస్తారు?
X

ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు రావడానికి మరో పన్నెండు రోజులు మిగిలి ఉంది. రాజకీయ నాయకులందరూ లెక్కల మాస్టర్లు అయిపోయారు. ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తామే రాజులమని, తామే మంత్రులమంటూ ఊహా లోకాల్లో తేలిపోతూ ఉన్నారు.

ఒకే ఒక్క రాజకీయ నాయకుడు, దేశంలోకెల్లా అందరికంటే సీనియర్ అని చెప్పుకుంటున్న నేత ఆలోచనలు మాత్రం మరో విధంగా ఉన్నాయి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓడిపోతే కర్తవ్యం ఏంటని ఆ సీనియర్ నాయకుడు మదన పడుతున్నారని సమాచారం. అంత హైరానా పడి పోతున్న నాయకుడు ఎవరో తెలుసా…? ఇంకెవరు నారా చంద్రబాబు నాయుడు.

ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైతే భవిష్యత్ ఏమిటనేది చంద్రబాబు నాయుడిని వేధిస్తున్న ప్రశ్నగా చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు ఓడిపోయినా తనకు నష్టం లేదని, వ్యాపార లావాదేవీలు చూసుకుంటానని ప్రకటించారు. అయితే లోలోన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలనే వేదన ఆయన్ని ఇబ్బంది పెడుతోందని చెబుతున్నారు.

శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై కేంద్రంలో తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితి దారుణంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు హైరానా పడుతున్నట్లు సమాచారం. కుటుంబానికున్న వ్యాపారాలు చూసుకుంటానని చంద్రబాబు నాయుడు పైకి ప్రకటించినా ఓటుకు నోటుతో సహా పాత కేసులన్నీ తిరగతోడతారనే భయం ఆయనను వెంటాడుతోందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

వృద్ధాప్యంలో రాజకీయంగా ఇబ్బందులపాలు అవుతాననే విషయం చంద్రబాబునాయుడికి తెలియక పోవడం వల్ల పొరపాట్లు చేశారని, వాటికి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని సీనియర్ల అభిప్రాయం.

ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ పరిస్థితి ఏంటో తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైతే మాత్రం చంద్రబాబు నాయుడులో నైరాశ్యం మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First Published:  10 May 2019 9:35 PM GMT
Next Story