Telugu Global
NEWS

డామిట్.... కథ అడ్డం తిరిగిందయ్యా చంద్రం...!

మిడి మిడి జ్ఞానం మొదటికే మోసం వస్తుందని ఆ నటుడికి తెలిసొచ్చింది. మంచికాలం ఉందిలే ముందుముందునా అంటూ తనకు ఏమాత్రం సంబంధంలేని రాజకీయాల్లో చెలరేగిపోవడం ఆ నటుడికి కొత్త కష్టాలు తీసుకొచ్చింది. ఇప్పుడు లబోదిబోమంటున్నా ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది. రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆయన ప్రస్తుత స్థితిని చూసి అదిరిందయ్యా చంద్రం…. అనుకుంటున్నారు. ఇంతకీ ఇన్ని సినిమా కష్టాలు అనుభవిస్తున్న ఆ నటుడు ఎవరనుకుంటున్నారా…? అవును… ఆయనే శివాజీ. మూడు సినిమాలు ఆరు […]

డామిట్.... కథ అడ్డం తిరిగిందయ్యా చంద్రం...!
X

మిడి మిడి జ్ఞానం మొదటికే మోసం వస్తుందని ఆ నటుడికి తెలిసొచ్చింది. మంచికాలం ఉందిలే ముందుముందునా అంటూ తనకు ఏమాత్రం సంబంధంలేని రాజకీయాల్లో చెలరేగిపోవడం ఆ నటుడికి కొత్త కష్టాలు తీసుకొచ్చింది. ఇప్పుడు లబోదిబోమంటున్నా ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది.

రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆయన ప్రస్తుత స్థితిని చూసి అదిరిందయ్యా చంద్రం…. అనుకుంటున్నారు. ఇంతకీ ఇన్ని సినిమా కష్టాలు అనుభవిస్తున్న ఆ నటుడు ఎవరనుకుంటున్నారా…? అవును… ఆయనే శివాజీ.

మూడు సినిమాలు ఆరు వేషాలుగా సాగిపోతున్న జీవితంలోకి శివాజీ రాజకీయాలను తెచ్చుకున్నారు. ఎవరి మాటలు నమ్మారో కాని భారతీయ జనతా పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ గరుడ అంటూ ఒకసారి… ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రళయం రాబోతోంది అంటూ మరొక్కసారి తనకు అండగా ఉన్న మీడియాలో రెచ్చిపోయారు.

ఇప్పుడు ఆ మీడియా యాజమాన్యం చేతులు మారడంతో శివాజీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటున్నారు. ఇన్నాళ్లూ తనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ భావించిన శివాజీ ఇటీవలి పరిణామాలతో అధ:పాతాళానికి వెళ్లి పోయారంటున్నారు.

గడచిన మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పేరుతో ఉద్యమం చేస్తున్నానంటూ మీడియాకి ఎక్కిన శివాజీని కొందరు తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకున్నారు అని తెలిసి భోరుమంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాను తీవ్రంగా విరుచుకుపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లోను, భారతీయ జనతా పార్టీ తిరిగి కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే తన పరిస్థితి మరింత దిగజారుతుందనే భయం శివాజీని వెంటాడుతోంది అంటున్నారు.

శివాజీ చేసిన ప్రకటనలు రాద్ధాంతం తో అటు సినీ పరిశ్రమలో కూడా ఆదరిస్తున్న వారు లేకుండా పోయారని, చిన్న చిన్న వేషాలు కూడా దక్కే అవకాశం రాదని శివాజీ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం.

20 లక్షలు ఖర్చుపెట్టి కొనుగోలు చేశానని చెబుతున్న టీవీ9 షేర్లు తనకు దక్కుతాయో లేదో తెలియని పరిస్థితి. తాను చేసిన రాజకీయ రచ్చ తో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే ఆందోళన… వీటి మధ్య నటుడు శివాజీ మనస్తాపంతో నలిగిపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

First Published:  11 May 2019 7:00 AM GMT
Next Story