Telugu Global
NEWS

ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్

రెండో క్వాలిఫైయర్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు ఎనిమిదోసారి ఫైనల్లో ధోనీ ఆర్మీ టైటిల్ ఫైట్ లో ముంబైతో చెన్నై ఢీ ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ లైనప్ పూర్తయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్లో అడుగు పెట్టింది. విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా ముగిసిన రెండో క్వాలిఫైయర్ లో సంచలనాల ఢిల్లీ క్యాపిటల్స్ ను 6 వికెట్లతో చిత్తు చేసింది. సూపర్ సండే టైటిల్ ఫైట్ లో మాజీ చాంపియన్ ముంబై […]

ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్
X
  • రెండో క్వాలిఫైయర్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు
  • ఎనిమిదోసారి ఫైనల్లో ధోనీ ఆర్మీ
  • టైటిల్ ఫైట్ లో ముంబైతో చెన్నై ఢీ

ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ లైనప్ పూర్తయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్లో అడుగు పెట్టింది.

విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా ముగిసిన రెండో క్వాలిఫైయర్ లో సంచలనాల ఢిల్లీ క్యాపిటల్స్ ను 6 వికెట్లతో చిత్తు చేసింది. సూపర్ సండే టైటిల్ ఫైట్ లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తో ఢీ కొంటుంది.

చెన్నై సూపర్ రికార్డు…

ఐపీఎల్ 12వ సీజన్ లో సైతం చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటుకొంది.ఎనిమిదోసారి ఫైనల్స్ చేరి వారేవ్వా అనిపించుకొంది. విశాఖ వేదికగా ముగిసిన రెండో క్వాలిఫైయర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను అలవోకగా ఓడించింది.

ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో…ముందుగా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్న చెన్నై ప్రత్యర్థిని 147 పరుగుల స్కోరుకే కట్టడి చేసింది.
పేసర్ దీపక్ చాహర్, స్పిన్నర్లు హర్భజన్, ఇమ్రాన్ తాహీర్, ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావో సమన్వయంతో, కుదురుగా బౌల్ చేసి ఢిల్లీ టాపార్డర్ కు పగ్గాలు వేశారు.

రిషబ్ పంత్ ఫైటింగ్ బ్యాటింగ్…

ఢిల్లీ 80 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయిన తరుణంలో యువ ఆటగాడు రిషభ్ పంత్ బాధ్యతాయుతంగా ఆడి 25 బాల్స్ లో 2 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 38 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ చివరకు 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.

చెన్నై ఓపెనర్లు దూకుడు…

148 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన చెన్నైకి ఓపెనింగ్ జోడీ ఫాబ్ డూప్లెసిస్- షేన్ వాట్సన్ 10.2 ఓవర్లలో 81 పరుగుల భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీలతో మోత మోగించారు. డూప్లెసీ 39 బాల్స్ లో 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 50, వాట్సన్ 32 బాల్స్ లో3 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 50 పరుగులు సాధించారు.

మిడిలార్డర్ ఆటగాడు అంబటి రాయుడు 20 బాల్స్ లో 3 బౌండ్రీలతో 20 పరుగుల నాటౌట్ స్కోరుతో తనజట్టుకు విజయం ఖాయం చేశాడు. చెన్నై ఓపెనర్ ఫాబ్ డూప్లెసీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్ తో చెన్నై తలపడనుంది.

First Published:  10 May 2019 9:27 PM GMT
Next Story