Telugu Global
NEWS

ఏపీలో 3లక్షల 46 వేల బిల్లులు పెండింగ్....

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి 3లక్షల 46 వేల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఇలాంటి బాధ్యతారహితమైన పాలన ఎప్పుడూ చూడలేదని వైసీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. జీతాల బకాయిలు ఉన్నాయని, రుణ అప్లికేషన్స్, ట్రాన్స్ పోర్టు అలవెన్స్, అద్దెల చెల్లింపు, డైట్ చార్జీలు, ఇంధన ఛార్జీలు, పేద ప్రజలకు చెల్లించాల్సిన సబ్సిడీలు అనేకం ప్రభుత్వం వద్దపెండింగ్ లో ఉన్నాయని, వివిధ రంగాలకు చెల్లించాల్సిన సబ్సిడీలే రూ.828 కోట్లు ఉన్నాయని, హాస్టల్ బిల్లులు రూ.78 కోట్లు […]

ఏపీలో 3లక్షల 46 వేల బిల్లులు పెండింగ్....
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి 3లక్షల 46 వేల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఇలాంటి బాధ్యతారహితమైన పాలన ఎప్పుడూ చూడలేదని వైసీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

జీతాల బకాయిలు ఉన్నాయని, రుణ అప్లికేషన్స్, ట్రాన్స్ పోర్టు అలవెన్స్, అద్దెల చెల్లింపు, డైట్ చార్జీలు, ఇంధన ఛార్జీలు, పేద ప్రజలకు చెల్లించాల్సిన సబ్సిడీలు అనేకం ప్రభుత్వం వద్దపెండింగ్ లో ఉన్నాయని, వివిధ రంగాలకు చెల్లించాల్సిన సబ్సిడీలే రూ.828 కోట్లు ఉన్నాయని, హాస్టల్ బిల్లులు రూ.78 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, ఈపాస్ బిల్లులు రూ.1,240 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, అదేవిధంగా వివిధ కార్పొరేషన్స్ కు గ్రాంట్ గా ఇవ్వాల్సిన డబ్బే రూ.4,800 కోట్లు ఉందని…. ఇలా తీర్చాల్సిన బాకీలను రాష్ట్రప్రభుత్వం పెండింగ్‌లో పెట్టి, తనకు పర్సెంటేజీలు వచ్చే కాంట్రాక్టర్లకు చంద్రబాబు నాయుడు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇస్తున్నాడని గడికోట విమర్శించారు.

ఇవికాకుండా వివిధ పథకాల కోసం, పునరావాస కాలనీల కోసం భూసేకరణకు చెల్లించాల్సిన డబ్బులు ఇప్పటికిప్పుడు రూ.880 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇందులో ఒక్క భూసేకరణకే రూ.693 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని, ఈ డబ్బులు రాక ఎంతో మంది ఎదురు చూస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

నిర్మాణ రంగంలో తీసుకుంటే 29వేల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, రూ.8,200 కోట్లకు పైగా వివిధ నిర్మాణాలు చేపట్టిన వారికి చెల్లించాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. 43 వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సిన బిల్లులు ఉంటే… అంత భారం మనపై ఉంటే.. ఖజానాలో మాత్రం రూ.9,000 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు తన స్వప్రయోజనాలకు వాడుకోవటం వల్లనే ఈ పరిస్థితి రావటం జరిగిందని గడికోట మండిపడ్డారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనూ తన వాళ్ళను చంద్రబాబు ఆఫీస్ కు పిలిపించుకొని ఎన్నికల్లో కమీషన్ ఇవ్వదలుచుకున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించమని ఆదేశాలు ఇచ్చారు. ఇలా చంద్రబాబు చేయటం వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. చిన్న చిన్న కాంట్రాక్టర్లు.. చిన్న చిన్న నిర్మాణాలు చేసేవారు అప్పులు చేసి పనులు చేశారు. బిల్లుల కోసం వారు తిరగాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం చేసిన దౌర్భాగ్య పరిస్థితి వల్లనే అని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా దొరక కూడదని చట్ట పరిధిలోనే కాకుండా ఇష్టమొచ్చినట్లు అప్పులు చేసేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇంతగా చంద్రబాబు దిగజార్చారు. భవిష్యత్తులో పేద ప్రజలకు సంబంధించి సబ్సిడీల విషయంలో ఆందోళన కలిగిస్తోంది.

చాలా విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు ఆపేశారు. ఆశ్రమ పాఠశాలల్లో డైట్ ఛార్జీలు, హోంగార్డు వేతనాలు, పోలీసుల డీఏ బిల్లులు చెల్లించటం లేదు అని శ్రీకాంత్ రెడ్డి వివరించారు.

ఏ రంగంలో ఎంత వ్యయం చేశారో సీఎంఎఫ్ఎస్ లో వివరాలు ఉండాలి. కానీ, ఆ వివరాలు ఉండవు. ఎక్కడా కనిపించవు. ఒక పద్దు నుంచి ఇంకో పద్దుకు ఇష్టానుసారంగా నిధులు బదలాయించారు. వీళ్లు క్షమాపణలకు కూడా అర్హులు కారు. ఆర్థిక వ్యవస్థను పార్టీ ప్రయోజనాలకు వాడుకోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ట్రాన్స్ ఫరెన్సీ, నిజాయితీ అని మాట్లాడుతూ పాలనను అవినీతి మయం చేశారని, చంద్రబాబు వల్ల రాష్ట్రం ఆర్థికంగా కోలుకోలేని విధంగా నాశనం అయిందని ఆయన అన్నారు.

First Published:  11 May 2019 7:38 AM GMT
Next Story