తన సినిమా కి తనే కథ రాసుకున్న నాగ శౌర్య

నాగ శౌర్య ప్రస్తుతం రెండు సినిమాలని పట్టాలు ఎక్కించే పని లో ఉన్నాడు. ఈ హీరో ఒక వైపు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం లో నటిస్తూ నే మరో సినిమా ని మొదలు పెడుతున్నాడు. ఈ సినిమా కి రమణ తేజ అనే నూతన దర్శకుడిని పరిచయం చేయనున్నాడు శౌర్య.

శౌర్య ఈ సినిమా ని తన సొంత నిర్మాణ సంస్థ లో నిర్మిస్తున్నాడు. నటి రమా ప్రభ కుటుంబానికి చెందిన వ్యక్తే రమణ తేజ. ఇంతకు ముందు కొన్ని లఘు చిత్రాలు చేసి అందరి మెప్పు ని పొందాడు.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర అంశం ఏంటి అంటే…. నాగ శౌర్య నే ఈ సినిమా కి కథ అందిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమా లాంచ్ కార్యక్రమం లో వెల్లడించిన వివరాల మేరకు, ఈ సినిమా కి నాగ శౌర్య కథ రచయిత గా చేస్తున్నాడట. విచిత్రం ఏంటి అంటే, ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు. శౌర్య కూడా తన లో రైటర్ స్కిల్ ఉంది అని ఎప్పుడూ చెప్పలేదు కూడా.

అయితే వరుస పరాజయాలతో చతికిల పడ్డ శౌర్య తన సినిమా కి తానే కథ సమకూర్చుకోవడం…. ఎంత వరకు సఫలమవుతాడు అనేది తెలియాల్సి ఉంది.