‘ప్రతి రోజు పండగే’ అంటున్న సాయి ధరమ్ తేజ్ !

సాయి ధరమ్ తేజ్…. వరుస ఫ్లాప్ లలో ఉన్న ఈ హీరో చిత్రలహరి సినిమాతో విజయం సాధించాడు. ఈ సినిమా విజయం తో మార్కెట్ లో మళ్ళీ తన స్థాయి ని మెరుగుపరుచుకున్నాడు. ఈ మెగా హీరో ఇప్పుడు కథల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉన్నాడు. అనుభవం ఉన్న దర్శకులతో పని చేసి, రెండు మూడు విజయాలు సాధించి, ఆ తర్వాతే ప్రయోగాల జోలికి వెళ్ళాలి అనే నిర్ణయానికి వచ్చాడు ఈ హీరో.

అయితే తాజాగా ఈ హీరో మారుతి దర్శకత్వం లో ఒక ఆసక్తికరమైన చిత్రాన్ని చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా కి ‘ప్రతి రోజు పండగే’ అనే టైటిల్ ని పెట్టాలి అని అనుకుంటున్నారట.

యూవీ క్రియేషన్స్ ఈ సినిమా ని నిర్మించే పనిలో ఉంది. ఈ సినిమా లో హీరో మరియు హీరో తండ్రి పాత్ర కీలకం అని సమాచారం. సాయి ధరమ్ కి తండ్రి గా రావు రమేష్ ని మారుతి ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.