Telugu Global
Cinema & Entertainment

కాశ్మీర్ బార్డర్ లో వెంకీ మామ ఏం చేయనున్నాడు?

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య మామ అల్లుళ్ళ గా మన అందరికీ పరిచయమే. అయితే వీరు ఇరువురు స్క్రీన్ పై తొలిసారి ప్రేమమ్ అనే సినిమా తో మెరిసారు. అప్పటి నుండి మళ్ళీ వీళ్ళ ఇద్దరినీ పెద్ద స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం లో డైరెక్టర్ బాబీ ‘వెంకీ మామ’ అనే చిత్రాన్ని తెర పై కి తెచ్చాడు. సురేష్ బాబు పర్యవేక్షణ లో స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకొని, […]

కాశ్మీర్ బార్డర్ లో వెంకీ మామ ఏం చేయనున్నాడు?
X

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య మామ అల్లుళ్ళ గా మన అందరికీ పరిచయమే. అయితే వీరు ఇరువురు స్క్రీన్ పై తొలిసారి ప్రేమమ్ అనే సినిమా తో మెరిసారు. అప్పటి నుండి మళ్ళీ వీళ్ళ ఇద్దరినీ పెద్ద స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం లో డైరెక్టర్ బాబీ ‘వెంకీ మామ’ అనే చిత్రాన్ని తెర పై కి తెచ్చాడు.

సురేష్ బాబు పర్యవేక్షణ లో స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకొని, దర్శకుడు బాబీ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. సినిమా టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్, ఇప్పటికీ చాలా మందిని ఆకర్షించింది.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి రెండు షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తియింది. మూడో షెడ్యూల్ ని మాత్రం ప్రతిష్టాత్మకం గా కాశ్మీర్ బార్డర్ లో ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా కి సంబంధించిన లొకేషన్స్ ని వెతికే పని లో ఉన్నట్లు తెలుస్తుంది. సినిమా లో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్ర లో కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమా ని కాశ్మీర్ బార్డర్ లో చిత్రీకరించనున్నారు దర్శక నిర్మాతలు.

త్వరలో ఈ కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ సినిమా లో నాగ చైతన్య కి జోడీ గా రాశి ఖన్నా, వెంకటేష్ కి జోడీ గా పాయల్ రాజ్ పుత్ నటించనున్నారు.

First Published:  11 May 2019 3:30 AM GMT
Next Story