Telugu Global
NEWS

అయ్యో చంద్రబాబూ...!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇక చివరి ప్రయత్నాలలో మునిగిపోయారనే వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి వీలుగా బాబు కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయత్నాలు క్రమక్రమంగా బెడిసికొడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఫలితాల తరువాత జతకడితే, రాష్ట్రపతి గుర్తిస్తారో…. లేదో అన్న అనుమానంతో అంతకు ముందే 21 పార్టీలు ఏకం కావాలని చంద్రబాబు భావించారు. అందుకు 21వ తేదీననే ఈ పార్టీలన్నీ ఏకం కావాలని సూచించారు. కానీ […]

అయ్యో చంద్రబాబూ...!
X

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇక చివరి ప్రయత్నాలలో మునిగిపోయారనే వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి వీలుగా బాబు కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయత్నాలు క్రమక్రమంగా బెడిసికొడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.

ఫలితాల తరువాత జతకడితే, రాష్ట్రపతి గుర్తిస్తారో…. లేదో అన్న అనుమానంతో అంతకు ముందే 21 పార్టీలు ఏకం కావాలని
చంద్రబాబు భావించారు. అందుకు 21వ తేదీననే ఈ పార్టీలన్నీ ఏకం కావాలని సూచించారు. కానీ బాబు ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సున్నితంగానే అయినా, గట్టిగానే తిరస్కరించారు.

మే 23న కౌంటింగ్ జరుగనుంది. ఇది జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. ఈవీఎం ల భద్రత, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తూ, పూర్తి నిఘా ఉంచాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులలో మనం పార్టీల సమావేశాలు పెట్టుకోవడం
అంత మంచిది కాదని మమత స్పష్టం చేసినట్టు తెలిసింది. మిగతా పార్టీలు కూడా బాబు ప్రతిపాదనల మీద అంతగా స్పందించలేదని అంటున్నారు.

దీంతో ఫోన్ ద్వారా అయినా అందరితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని బాబు భావిస్తున్నారట. నిజానికి రాహుల్ ను ప్రధానిగా చేసేందుకు మమత అంతగా ఇష్టపడడం లేదంటున్నారు. అన్నీ కుదిరితే తానే ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని ఆలోచిస్తున్నారు. అందుకే చంద్రబాబు యత్నాలకు ఆమె చెక్ పెట్టారని సమాచారం.

అటు యూపీలోనూ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీ గద్దెను ఎక్కితే చూడాలని అఖిలేశ్ యాదవ్ కూడా తహతహలాడుతున్నారు. ఇందుకు సహకరించేందుకు బిహార్ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా సిద్ధంగానే ఉన్నారంటున్నారు.

ఇక మాయావతి ’నా దారి రహదారి’ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంగతి సరేసరి. ఢిల్లీ రైలు ఎక్కేందుకు ఆయన ఏనాడో పెట్టే, బేడా సర్దుకున్నారు. ఇన్ని అవరోధాల నడుమ రాహుల్ ప్రధాని కావడమనేది క్లిష్టమైన వ్యవహారమేనంటున్నారు పరిశీలకులు.

ఇలా దాదాపు అందరు నాయకులు చంద్రబాబు ఆశల మీద కుండల కొద్దీ నీళ్లు గుమ్మరిస్తున్నారని అంటున్నారు. ఇంకోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు ఎటు వైపు పడతాయో తెలియకపోవడం కూడా బాబును చీకాకు పరుస్తోందని అంటున్నారు. ఇంతటి అయోమయ పరిస్థితిని ఆయన ఎప్పుడూ ఎదుర్కోలేదని అంటున్నారు… నలభై సంవత్సరాల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబు పరిస్థితిని చూసి ఆ పార్టీ నాయకులే… అయ్యో చంద్రబాబూ!!! అంటున్నారు.

First Published:  12 May 2019 4:03 AM GMT
Next Story