నాగచైతన్యకు అసలైన సంబరం ఇదే

నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మజిలీ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో ఎవరికీ ఎలాంటి కంప్లయింట్స్ లేవు. కాకపోతే ఈ సినిమా ఓ మైలురాయిని అందుకుంటుందా అనే అనుమానాలు మాత్రం అందర్లో ఉండేవి. అదే 40 కోట్ల క్లబ్. కెరీర్ లో తొలిసారి నాగచైతన్య ఈ మార్క్ అందుకుంటాడా అని అంతా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది.

నిన్నటి వసూళ్లతో కలుపుకొని నాగచైతన్య 40 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. ఈ హీరో కెరీర్ కు సంబంధించి 40 కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి సినిమాగా మజిలీ నిలిచిపోయింది. నిజానికి మజిలీ సినిమా ఈ ఘనత సాధించదని అంతా అనుకున్నారు. ఎందుకంటే మహర్షి సినిమా వచ్చేసింది. మ్యాగ్జిమమ్ థియేటర్లు దానికే వెళ్లిపోయాయి. ఇలాంటి టైమ్ లో మజిలీ థియేట్రికల్ రన్ క్లోజ్ అవుతుందని అంతా అనుకున్నారు. అది కూడా కేవలం కోటిన్నర దూరంలో 40 కోట్ల క్లబ్ లో చేరకుండా నిలిచిపోతుందని అక్కినేని ఫ్యాన్స్ బాధపడ్డారు. కానీ నిన్నటి వసూళ్లతో ఈ సినిమా ఆ ఘనత సాధించింది.

ఈ వీకెండ్ మినహాయిస్తే, రేపట్నుంచి ఈ సినిమా ఇక థియేటర్లలో మనుగడ సాధించడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఆల్రెడీ మహర్షి, ఎవెంజర్స్ సినిమాలు ఆక్రమించేశాయి. దీనికి తోడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో మజిలీ సినిమా ప్రత్యక్షమైంది. సో.. మొత్తమ్మీద మజిలీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు చైతూ.