సైరా.. కొత్త విడుదల తేదీ ఇదే

సైరా సినిమా విడుదల తేదీపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. గతంలో ఎప్పుడో రామ్ చరణ్ చెప్పిన తేదీల ప్రకారం చూసుకుంటే ఈపాటికి సినిమా థియేటర్లలోకి రావాలి. కానీ సైరా షూటింగ్ రోజురోజుకు ఆలస్యం అవుతోంది. అందుకు తగ్గట్టే విడుదల తేదీలు కూడా మారిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో రిలీజ్ డేట్ తెరపైకి వచ్చింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే సైరా సినిమాను గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేస్తారట. ఈ రూమర్ సంగతి పక్కనపెడితే, సినిమా సమ్మర్ తర్వాత లేదా దసరాకు రాదనే విషయంపై మాత్రం ఈ పుకారుతో స్పష్టత వచ్చేసింది. మరీ ముఖ్యంగా దీన్ని పుకారుగా చూడాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే, తాము చెప్పాలనుకున్న విషయాన్ని ఇలా లీకుల రూపంలో బయటకు వదలడం మెగా కాంపౌండ్ కు అలవాటే. కాబట్టి అక్టోబర్ 2కు ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిపోవచ్చంటున్నారు.

సైరా సినిమాకు సంబంధించి తాజాగా మరో రీషూట్ జరిగింది. గతంలో తీసిన క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ ను పూర్తిగా పక్కనపెట్టేసి, క్లయిమాక్స్ ను మరికాస్త మార్చి ఫ్రెష్ గా షూటింగ్ చేశారు. ఈసారి క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా చక్కగా వచ్చిందంటున్నారు. యూనిట్ మొత్తం పూర్తి సంతృప్తి వ్యక్తంచేసినట్టు చెబుతున్నారు. మొత్తానికి ఇలా భారీ షెడ్యూల్స్, రీషూట్స్ తో సైరా షూటింగ్ సాగిపోతూనే ఉంది. ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే 200 కోట్లు దాటినట్టు చెబుతున్నారు.