Telugu Global
NEWS

తమ్ముళ్లూ ఏమిటీ విచిత్ర వాదనలు...!

తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు అధినేతతో పోటీపడి మరీ విచిత్ర వాదనలు చేస్తున్నారు. జనం ఏమనుకుంటారో అన్న స్పృహ కూడా వారికి లేకుండా పోతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న వర్ల రామయ్య నిన్నటికి నిన్న ఆర్టీసీకి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరనే కుదరదని తేల్చి చెప్పారు. అసలు ఆర్టీసీ నేటి దుస్థితికి కాంగ్రెసే కారణమని దుయ్యబట్టారు. కానీ, సంస్థను అభివృద్ధి పథంలో నడపడానికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు […]

తమ్ముళ్లూ ఏమిటీ విచిత్ర వాదనలు...!
X

తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు అధినేతతో పోటీపడి మరీ విచిత్ర వాదనలు చేస్తున్నారు. జనం ఏమనుకుంటారో అన్న స్పృహ కూడా వారికి లేకుండా పోతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న వర్ల రామయ్య నిన్నటికి నిన్న ఆర్టీసీకి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరనే కుదరదని తేల్చి చెప్పారు. అసలు ఆర్టీసీ నేటి దుస్థితికి కాంగ్రెసే కారణమని దుయ్యబట్టారు. కానీ, సంస్థను అభివృద్ధి పథంలో నడపడానికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుందో మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.

ఆర్టీసీ తిరోగమనానికి కాంగ్రెసే కారణం అయితే టీడీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో దాని ఉన్నతికి చర్యలు తీసుకుని ఉండవచ్చు కదా? నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాభాల బాటలో నడిపించాడు కదా..! మరి మీరు అధికారంలోకి రాగానే మళ్ళీ ఆర్టీసీ ఎందుకు నష్టాల బాట పట్టింది…. అన్న ప్రతిపక్షాల ప్రశ్నకు మాత్రం రామయ్య సమాధానం ఇవ్వడం లేదంటున్నారు.

రామయ్య దాదాపు మూడేళ్ల క్రితం ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఏం చేశారో చెప్పాలంటున్నారు కార్మికులు. ఎవరు అధికారంలోకి వచ్చినా సంస్థ బాగు గురించి కాకుండా తమ స్వార్థం కోసమే పని చేశారంటున్నారు.

నిజానికి చంద్రబాబు తలుచుకుంటే ఆర్టీసీ ఏనాడో బాగుపడేదని, కానీ, ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా, టీడీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు.

మరోవైపు మొన్నటి వరకు ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉండి, ఇప్పుడు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన అశోక్ బాబు కూడా అంతే విచిత్రంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.

ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం వైసీపీ అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జగన్ బీజేపీని నిలదీయకపోవడంతోనే కేంద్రం ఏపీకి నిధులు విడుదల చేయలేదనడం అశోక్ బాబు రాజకీయ పరిణితిని తెలియజేస్తోందంటున్నారు.

జగన్ గట్టిగా నిలదీసి ఉంటే రాష్ట్రానికి నిధుల వరద పారేదని, విపక్ష నేత నిధులు కావాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తే తమరు అధికారంలో ఉండి ఏం ప్రయోజనం సారూ.. అని టీడీపీ నాయకులను పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రాభివృద్ధికి నిధులు సేకరించడం పాలకుల బాధ్యత అనే విషయం కూడా తెలియదా అని నిలదీస్తున్నారు. నాలుగేళ్లు టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగానే ఉంది కదా? ప్రధానిని ఒప్పించి నిధులు తెచ్చుకోలేకపోయిందా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ అడిగితే నిధులు వచ్చేవని టీడీపీ నేతలు భావిస్తున్నారంటే తాము అసమర్థులం అని వారికి వారే ఒప్పుకున్నట్టు అవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంతకీ ఈ మాటలు వారి చెవికి ఎక్కుతాయా అంటే..అనుమామేనంటున్నారు. సమస్య పరిష్కారం దిశగా కాకుండా ఎదురుదాడి చేయడమే లక్ష్యంగా వారు ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.

First Published:  11 May 2019 11:50 PM GMT
Next Story