విజయ్ దేవరకొండ తో పెళ్ళి…. స్పందించిన హీరోయిన్

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ తో పాటు తన తదుపరి చిత్రం షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. తనకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న క్రాంతి మాధవ్ దర్శకత్వం లో, సీనియర్ నిర్మాత కే ఎస్ రామారావు నిర్మాణం లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై సినిమా చేస్తున్నాడు విజయ్.

ఈ సినిమా ఎప్పుడో లాంచ్ అయ్యి మెల్లగా షూటింగ్ ని కూడా జరుపుకుంటుంది. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఐశ్వర్య రాజేష్ ఒకరు. తమిళం లో ‘కాకా ముట్టాయి’ చిత్రం తో అందరికీ దగ్గరయిన ఈ భామ కి తెలుగు లో ఇదే మొదటి చిత్రం.

ఈ మధ్యనే ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నది.

ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఇప్పుడు బయటకు వచ్చాయి. త్వరలోనే విజయ్ ని ఈ భామ పెళ్లి చేసుకుంటుంది అనే రూమర్స్ కూడా వచ్చాయి.

అయితే ఇలాంటి పుకార్ల మీద ఘాటుగా స్పందించింది ఈ భామ… “నా లవ్ స్టోరీ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని ఉంది. ఎవరో చెప్పండి ప్లీజ్” అని సెటైర్ వేసిన ఐశ్వర్య పుకార్లలకి తెలివిగా ఫుల్ స్టాప్ పెట్టింది.