Telugu Global
NEWS

ఐపీఎల్ ఫైనల్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్

ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఎడతెగని ఉత్కంఠ టైటిల్ సమరంలో ముంబై సంచలన విజయం తుదివరకూ పోరాడి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్… భారత, ప్రపంచ క్రికెట్ అభిమానులను గత ఏడువారాలుగా కదిపికుదిపేసిన ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్స్…సస్పెన్స్ థ్రిల్లర్లా సాగి… టోర్నీకే హైలైట్ గా మిగిలిపోయింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన 2019 సీజన్ టైటిల్ సమరం..నువ్వానేనా అన్నట్లుగా సాగింది. ఆధిక్యత చేతులు మారుతూ…. మొత్తం 39 వేల అభిమానుల సాక్షిగా […]

ఐపీఎల్ ఫైనల్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్
X
  • ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఎడతెగని ఉత్కంఠ
  • టైటిల్ సమరంలో ముంబై సంచలన విజయం
  • తుదివరకూ పోరాడి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్…

భారత, ప్రపంచ క్రికెట్ అభిమానులను గత ఏడువారాలుగా కదిపికుదిపేసిన ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్స్…సస్పెన్స్ థ్రిల్లర్లా సాగి… టోర్నీకే హైలైట్ గా మిగిలిపోయింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన 2019 సీజన్ టైటిల్ సమరం..నువ్వానేనా అన్నట్లుగా సాగింది.

ఆధిక్యత చేతులు మారుతూ….

మొత్తం 39 వేల అభిమానుల సాక్షిగా రాజీవ్ స్టేడియంలో సాగిన ఈ టైటిల్ పోరులో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ…ముందుగా కీలక టాస్ నెగ్గి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొన్నాడు.

ఓపెనర్లు రోహిత్ శర్మ- క్వింటన్ డీ కాక్…మొదటి వికెట్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చి…వెంట వెంటనే అవుటయ్యారు. ఆ తర్వాత నుంచి చెన్నై బౌలర్లు మ్యాచ్ పై పట్టు బిగించారు.

పోలార్డ్ ఫైటింగ్ బ్యాటింగ్….

ముంబై టాపార్డర్ పూర్తిస్థాయిలో రాణించ లేకపోడంతో…సీనియర్ ఆటగాడు కీరాన్ పోలార్డ్ పై జట్టు భారం పడింది. పోలార్డ్ 25 బాల్స్ లో మూడు సిక్సర్లు, మూడు బౌండ్రీలతో 41 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగుల స్కోరు సాధించగలిగింది.

చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు, శార్ధూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహీర్ చెరో రెండువికెట్లు పడగొట్టారు.

వాట్సన్ కష్టం వృథా…

150 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన చెన్నై ఆరంభం అదిరినా…ముంబై బౌలర్లు కీలక సమయాలలో వికెట్లు సాధించడం ద్వారా మ్యాచ్ ను తమ అదుపులో ఉంచుకోగలిగారు.

మలింగ, కృణాల్ పాండ్యా భారీగా పరుగులు ఇవ్వడం, వెటరన్ ఓపెనర్ షేన్ వాట్సన్ దూకుడుగా ఆడటంతో …చెన్నై విజయం ఖాయమే అనిపించింది.

మిడిల్ ఓవర్లలో కెప్టెన్ ధోనీ, డెత్ ఓవర్లలో వాట్సన్ రనౌట్ కావడంతో మ్యాచ్ ములుపు తిరిగింది.మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన చెన్నై ని మలింగ చావుదెబ్బ కొట్టాడు.

శార్ధూల్ ఠాకూర్ ను ఓ సూపర్ యార్కర్ తో మలింగ అవుట్ చేయడంతో.. ముంబై 1 పరుగుతో విజేతగా నిలిచింది. ముంబై పేసర్ జస్ ప్రీత్ బుమ్రా 13 డాట్ బాల్స్ తో చెన్నైకి పగ్గాలు వేశాడు.

వాట్సన్ 59 బాల్స్ లో 8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 80 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా

4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన పేసర్ జస్ ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ముంబై ప్రత్యర్థిగా నాలుగు ఫైనల్స్ ఆడిన చెన్నైకి మరోసారి ఓటమి తప్పలేదు.

ఐపీఎల్ 12వ సీజన్లో భాగంగా జరిగిన మొత్తం 58 మ్యాచ్ ల్లో 20 మ్యాచ్ లు ఆఖరి ఓవర్ ఆఖరిబంతి వరకూ సాగటం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

First Published:  13 May 2019 12:25 AM GMT
Next Story