ఐపీఎల్ లో ముంబై సరికొత్త రికార్డు

  • ఆరు ఫైనల్స్ లో 4 టైటిల్స్ నెగ్గిన తొలిజట్టు
  • చెన్నై రికార్డును అధిగమించిన ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 12వ సీజన్లోనూ మూడుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ఆధిపత్యమే కొనసాగింది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించడం ద్వారా నాలుగోసారి టైటిల్ అందుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది.

టేబుల్ టాపర్ నుంచి టైటిల్ వరకూ…

2019 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎనిమిదిజట్ల లీగ్ టేబుల్ టాపర్ గా నిలవడమే కాదు…డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై సంచలన విజయంతో ట్రోఫీని సైతం అందుకొంది.

ప్రస్తుత సీజన్లో చెన్నై ప్రత్యర్థిగా ఆడిన నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గి తిరుగులేని ఆధిపత్యం చాటుకొంది.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో…

డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ కు అత్యంత విజయవంతమైన జట్టుగా మాత్రమే కాదు…అత్యధిక టైటిల్స్ సాధించిన రికార్డు సైతం ఉంది.

ఆరు ఫైనల్స్ లో 4 టైటిల్స్….

ఐపీఎల్ గత 12 సీజన్ల చరిత్రలో ఆరుసార్లు ఫైనల్స్ చేరిన ముంబై… నాలుగో టైటిల్ అందుకొని ఈ ఘనత సాధించిన తొలిజట్టుగా రికార్డుల్లో చేరింది.

అంతేకాదు…చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థిగా ఫైనల్లో 2013, 2015 , 2019 టైటిల్స్ నెగ్గిన రికార్డు సొంతం చేసుకొంది.

రోహిత్ నాయకత్వంలో…

రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై మెరిసింది. మాస్టర్ సచిన్ టెండుల్కర్ మెంటార్ గా… సత్తా చాటుకొంది.
రోహిత్ శర్మ, కిరాన్ పోలార్డ్, డీ కాక్ , మెక్ లెంగ్లాన్‌, మలింగ లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లతో పాటు… సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, రాహుల్ చహార్, మార్కండే లాంటి యువఆటగాళ్లతో ముంబై సమతూకంతో… అత్యంత పటిష్టమైన జట్టుగా తయారయ్యింది.

ప్రస్తుత సీజన్లో ఫైనల్స్ వరకూ ఆడిన మొత్తం 16 మ్యాచ్ ల్లో ముంబై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది.
చెపాక్ వేదికగా ముగిసిన తొలి క్వాలిఫైయర్స్ లో చెన్నైని చిత్తు చేసిన ముంబై… హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలోముగిసిన టైటిల్ సమరంలో సైతం విజేతగా నిలిచింది. ఐపీఎల్ ట్రోఫీతో పాటు… 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సైతం సొంతం చేసుకొంది.