Telugu Global
Cinema & Entertainment

50 కోట్ల మార్క్ అందుకోబోతున్న మహర్షి

మహర్షి సినిమా ఈరోజుతో 50 కోట్ల మార్క్ అందుకోబోతోంది. నిన్నటితో 4 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ఇప్పటివరకు 49 కోట్ల 13 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇవాళ్టి కలెక్షన్ కూడా కలుపుకుంటే ఈ సినిమా 50 కోట్ల రూపాయల షేర్ అందుకుంటుంది. అటు గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 101 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఏపీ, నైజాంలో చాలా ప్రాంతాల్లో నాన్-బాహుబలి రికార్డులు సృష్టిస్తోంది మహర్షి. వరల్డ్ వైడ్ ఇప్పటికే […]

50 కోట్ల మార్క్ అందుకోబోతున్న మహర్షి
X

మహర్షి సినిమా ఈరోజుతో 50 కోట్ల మార్క్ అందుకోబోతోంది. నిన్నటితో 4 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ఇప్పటివరకు 49 కోట్ల 13 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇవాళ్టి కలెక్షన్ కూడా కలుపుకుంటే ఈ సినిమా 50 కోట్ల రూపాయల షేర్ అందుకుంటుంది. అటు గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 101 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

ఏపీ, నైజాంలో చాలా ప్రాంతాల్లో నాన్-బాహుబలి రికార్డులు సృష్టిస్తోంది మహర్షి. వరల్డ్ వైడ్ ఇప్పటికే 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల రూపాయల షేర్ టచ్ చేయబోతోంది.

ఇక నైజాం విషయానికొస్తే, 4 రోజుల్లోనే 16 కోట్ల మార్క్ టచ్ చేసిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది మహర్షి.

అయితే సినిమా ఎన్ని రికార్డులు సృష్టించినా ఇంకా బ్రేక్-ఈవెన్ మాత్రం అవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 36 కోట్ల రూపాయలు రావాలి. నిలకడగా మరో 2 వారాలు ఆడితే తప్ప 36 కోట్లు రావు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి వారంతంలో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 16.62 కోట్లు
సీడెడ్ – రూ. 6.18 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.13 కోట్లు
ఈస్ట్ – రూ. 4.92 కోట్లు
వెస్ట్ – రూ. 3.74 కోట్లు
గుంటూరు – రూ. 5.90 కోట్లు
నెల్లూరు – రూ. 1.75 కోట్లు
కృష్ణా – రూ. 3.63 కోట్లు

First Published:  13 May 2019 2:05 AM GMT
Next Story