Telugu Global
NEWS

భారత క్రికెట్ నవతరం డైనమైట్ రిషభ్ పంత్

ఐపీఎల్ -2019లో పంత్ ఫటాఫట్ షో 16 మ్యాచ్ ల్లో 488 పరుగుల పంత్  మూడు హాఫ్ సెంచరీలతో 163.63 స్ట్రయిక్ రేట్  ముంబై పై 27 బాల్స్ లోనే 78 పరుగులు ఎలిమినేటర్ రౌండ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా పంత్ భారత నవతరం క్రికెటర్, ఐపీఎల్ లో ఢిల్లీ డైనమైట్ రిషభ్ పంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం రిషభ్ పంత్ బ్యాటింగ్ జోరు కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ 2012 సీజన్ తర్వాత […]

భారత క్రికెట్ నవతరం డైనమైట్ రిషభ్ పంత్
X
  • ఐపీఎల్ -2019లో పంత్ ఫటాఫట్ షో
  • 16 మ్యాచ్ ల్లో 488 పరుగుల పంత్
  • మూడు హాఫ్ సెంచరీలతో 163.63 స్ట్రయిక్ రేట్
  • ముంబై పై 27 బాల్స్ లోనే 78 పరుగులు
  • ఎలిమినేటర్ రౌండ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా పంత్

భారత నవతరం క్రికెటర్, ఐపీఎల్ లో ఢిల్లీ డైనమైట్ రిషభ్ పంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం రిషభ్ పంత్ బ్యాటింగ్ జోరు కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ 2012 సీజన్ తర్వాత తొలిసారిగా ప్లే ఆఫ్ రౌండ్ చేరుకోగలిగింది.

అంతేకాదు… హైదరాబాద్ సన్ రైజర్స్ తో ముగిసిన ఎలిమినేటర్ రౌండ్లో ఢిల్లీ విజేతగా నిలవడంలో రిషభ్ పంత్ ప్రధాన పాత్ర వహించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

మ్యాచ్ విన్నర్ రిషభ్ పంత్…

విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా ముగిసిన ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ లో… రిషభ్ పంత్ 5 సిక్సర్లు, 2 బౌండ్రీలతో 49 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

ప్రస్తుత సీజన్లో 14 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ నుంచి రెండో క్వాలిఫైయర్ రౌండ్ వరకూ 16 మ్యాచ్ లు ఆడిన రిషభ్ పంత్ 488 పరుగులు సాధించాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి.

ముంబై పై మెరుపు బ్యాటింగ్…

ముంబై ఇండియన్స్ తో ముగిసిన మ్యాచ్ లో రిషభ్ కేవలం 27 బాల్స్ లోనే 78 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. రిషభ్ సగటు 37.5 గా ఉన్నా…. స్ట్రయిక్ రేట్ మాత్రం 163.63 గా నమోదయ్యింది.

ప్రశంసల వెల్లువ….

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా… దూకుడుగా, నిర్భయంగా షాట్లు ఆడటానికి పెట్టింది పేరైన రిషభ్ పంత్ పై ప్రశంసలవర్షం కురుస్తోంది. పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు పంత్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

రిషభ్ పంత్ ను నేటి తరం వీరేంద్ర సెహ్వాగ్ గా… మాజీ క్రికెటర్, కామెంటీటర్ సంజయ్ మంజ్రేకర్ అభివర్ణించాడు. రానున్న కాలం రిషభ్ పంత్ దే నంటూ కొనియాడాడు.

రిషభ్ పంత్ ను తన సహజసిద్ధమైన శైలిలోనే బ్యాటింగ్ కొనసాగించేలా సహకరించాలని టీమ్ మేనేజ్ మెంట్ కు సూచించాడు.
మరోవైపు…ఇంగ్లండ్ వేదికగా ఈనెల 30 నుంచి జరిగే 2019 వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో చోటు కల్పించకపోడం పట్ల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

తనదైన రోజున సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ లు గెలిపించే సత్తా పంత్ కు ఉందని వాన్ గుర్తు చేశాడు.

ఐపీఎల్ -2018 సీజన్లో సెంచరీ బాదిన భారత తొలి ఆటగాడి ఘనతను రిషభ్ పంత్ సొంతం చేసుకొన్నాడు. కేవలం 63 బాల్స్ లో 15 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 128 పరుగులు సాధించాడు.

First Published:  13 May 2019 2:00 AM GMT
Next Story