సాహో ఎఫెక్ట్… వెనక్కి తగ్గిన నాగ్

ప్రభాస్ ప్రస్తుతం సాహో అనే భారీ చిత్ర నిర్మాణంలో నిమగ్నమై ఉన్నాడు. బాహుబలి తర్వాత తన నుండి వస్తున్న చిత్రం ఇదే కావడం తో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సుజీత్ దర్శకుడి గా యూవీ క్రియేషన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ తెలుగులో అరంగేట్రం చేస్తుంది.

తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాని ఆగస్టు 15 న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు.

అయితే మరో పక్క నాగార్జున ప్రధాన పాత్ర లో వస్తున్న మన్మధుడు 2 చిత్రాన్ని ఆగస్టు 29 న నాగార్జున పుట్టిన రోజు సందర్భం గా అభిమానుల కోసం విడుదల చేయాలని ఆ సినిమా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఈ సినిమాను వాయిదా వేస్తే మంచిదని కొంత మంది బయ్యర్లు నాగార్జునకు సూచన చేశారట. ఈ సినిమాని అనుకున్న టైం కి విడుదల చేస్తే సాహో నుంచి కాంపిటీషన్ ఉంటదన్న ఆలోచనతో నాగార్జున కూడా వెనక్కి తగ్గాడట. పెద్దగా కాంపిటీషన్ లేని సమయంలో ఈ సినిమా విడుదల అయితే వసూళ్లు బాగా ఉంటాయి అని నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తుంది.