Telugu Global
NEWS

తెలంగాణలో టీఆర్ఎస్ ఎదురీత?

తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. సోమవారం మూడో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ తరుణంలో కొన్ని ఆసక్తికర మైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీకే మొగ్గు ఉంటుంది. అలాగే పరిషత్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేస్తుందని పలువురు భావిస్తున్నారు. అయితే తాజాగా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా చోట్ల టీఆర్ఎస్ కు  రెబల్స్ బెడద ఉందని, అధికార పార్టీ విజయావకాశాల మీద వీరి ప్రభావం బాగానే ఉండవచ్చని చెబుతున్నారు. మరోవైపు […]

తెలంగాణలో టీఆర్ఎస్ ఎదురీత?
X

తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. సోమవారం మూడో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ తరుణంలో కొన్ని ఆసక్తికర మైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీకే మొగ్గు ఉంటుంది. అలాగే పరిషత్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేస్తుందని పలువురు భావిస్తున్నారు.

అయితే తాజాగా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా చోట్ల టీఆర్ఎస్ కు రెబల్స్ బెడద ఉందని, అధికార పార్టీ విజయావకాశాల మీద వీరి ప్రభావం బాగానే ఉండవచ్చని చెబుతున్నారు.

మరోవైపు స్థానిక నాయకుల మధ్య సయోధ్య కుదర్చడంలోనూ ఎమ్మెల్యేలూ విఫలమయ్యారని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిన చోట ఈ సమస్య ఎక్కువగా ఉందని చెబుతు న్నారు. దీంతో చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు కోసం బాగా కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. సునాయసంగా గెలిచే చోట కూడా ఎదురీత తప్పడం లేదని అంటున్నారు.

మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ కు లభించే అవకాశాలు ఉన్నా, అధికార పార్టీ ఆశించినంతగా ఫలితాలు రాకపోవచ్చని పరిశీలకుల అభిప్రాయంగా ఉంది. వలసలు, చేరికలతో పార్టీ కిక్కిరిసిపోయిందని, ఇది తాము చేజేతులా చేసుకున్నదే అంటున్నారట సీనియర్ నాయకులు. ఆశించిన ఫలితాలు రాకపోతే జిల్లా పరిషత్ లను కైవసం చేసుకోవడంలో అవాంతరాలు తప్పవని అంటున్నారట.

కొన్ని చోట్ల పరిషత్ ఎన్నికలను స్థానిక నాయకులు అంత సీరియస్ గా తీసుకోలేదని చెబుతున్నారు. ఈ అన్ని పరిణామాలు జడ్పీ చైర్మన్ కావాలనుకుంటున్నవారికి తలనొప్పిగా మారాయని చెబుతున్నారు. అక్కడక్కడా రెబల్ అభ్యర్థులు తాము గెలవకున్నా పరవాలేదుగానీ, అధికార పార్టీ అభ్యర్థులు గెలవకూడదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఇది టీఆర్ఎస్ నేతలను కలవరపెడుతోందని చెబుతున్నారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మందలించినా కూడా కొందరు నాయకులు మారలేదని, ఇది కూడా ఇబ్బందికరమేనని అంటున్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెనువెంటనే పరిషత్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ రెండింటిలోనూ తిరుగులేని విజయాలు సాధించాలనేది టీఆర్ఎస్ అగ్రనేతల ఆలోచనగా ఉంది. మరి వారి కోరిక నెరవేరుతుందా? లేదా ? అన్నది వేచి చూడాల్సిందే.

First Published:  13 May 2019 1:02 AM GMT
Next Story