తమిళ సినిమాలంటే శిరీష్ కి ఇష్టమట !

అల్లు హీరో శిరీష్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఒక్క క్షణం’ అనే సినిమాతో మరొక డిసాస్టర్ ను అందుకున్నాడు. ఈ హీరో ఇప్పుడు ‘ఏ బి సి డి’ అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మళయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఏబిసిడి’ అనే సినిమాకి అధికారిక తెలుగు రీమేక్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా…. ఈ శుక్రవారం విడుదల కాబోతోంది.

చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలతో బిజీ అయ్యాడు అల్లు శిరీష్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. అల్లు శిరీష్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తనకు తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టి…. సినిమాలు చేయాలని ఆసక్తి గా ఉందని చెప్పుకొచ్చాడు. పుట్టి పెరిగింది చెన్నైలో కాబట్టి తమిళ సినిమాలంటే తనకు ఇష్టమన్నాడు అల్లు శిరీష్.

సూర్య హీరోగా వచ్చిన ‘కాప్పన్’ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాల్సి ఉందని… కానీ ఆఖరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చిందట. చూస్తూ ఉంటే అతి త్వరలోనే అల్లు శిరీష్ తమిళ ఇండస్ట్రీ లో అడుగు పెట్టే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే శిరీష అన్న అల్లు అర్జున్ మలయాళంలో మంచి పేరు తెచ్చుకోగా తమ్ముడు తమిళ ఇండస్ట్రీ పై కన్నేశాడు.