‘కేజిఎఫ్: చాప్టర్ 2’…. షూటింగ్ అప్ డేట్స్

బ్లాక్ బస్టర్ సినిమా ‘కే జి ఎఫ్: చాప్టర్ 1’ తో కన్నడ రాకింగ్ స్టార్ యష్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేసుకున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.

హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందుర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం కన్నడలో మాత్రమే కాక హిందీ, తెలుగు, తమిళం భాషల్లో కూడా విడుదలైంది. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ చిత్రం గా నిలిచింది.

ఇప్పుడు అదే సినిమాకు రెండవ భాగమైన ‘కేజిఎఫ్: చాప్టర్ 2’ అనే సినిమా త్వరలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మైసూర్లో షూటింగ్ చేయబోతున్నారట. ఆ తరువాత రామోజీ ఫిలిం సిటీ మరియు చివరగా కర్ణాటక-బళ్ళారి లో ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

దీనితో 80 నుంచి 90 శాతం షూటింగ్ పూర్తవుతుందట. ఈ విషయాన్ని ‘కే జి ఎఫ్’ టీం అధికారికంగా ప్రకటించింది. మరి ‘కె జీ ఎఫ్ చాప్టర్ 1’ లాగానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.