సుదర్శన్ థియేటర్లో సూపర్ స్టార్

అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో థియేటర్లను సందర్శించాడు మహేష్. ఆ తర్వాత పూర్తిగా అలాంటి పనులు మానుకున్నాడు. తన సినిమాలకు సంబంధించి ఈ హీరో ఇంటర్వ్యూలు ఇవ్వడమే గొప్ప విషయం. అలాంటిది తన 25వ సినిమా కోసం ఈయన తెగ కష్టపడుతున్నాడు. అంతేకాదు, చిన్నప్పుడే వదిలేసిన థియేటర్ల సందర్శనను కూడా మళ్లీ ప్రారంభించబోతున్నాడు.

నాలుగు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ చరిత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసింది మహర్షి సినిమా. ఒక్క నైజాం ఏరియా లోనే 5 రోజుల్లో 19.01 కోట్ల రూపాయల రికార్డు షేర్ తో దూసుకెళ్తూ మొదటి వారం లోనే మహేష్ గత చిత్రాల ఫుల్ రన్ రికార్డులని తిరగరాయనుంది. ఈ సందర్భంగా ప్రచారాన్ని మరింత పెంచాలని నిర్ణయించాడు మహేష్.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మెమొరబుల్ బ్లాక్ బస్టర్స్ అయిన మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో ఎన్నో రికార్డులు సృష్టించాయి. తాజాగా మహేష్ 25 వ చిత్రం ‘మహర్షి’ సుదర్శన్ 35 ఎం ఎం లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తనకు కంచుకోటగా మారిన ఈ థియేటర్ ను బుధవారం ( మే 15 ) సాయంత్రం 6 గంటలకు సందర్శించనున్నాడు మహేష్. అభిమానుల్ని పలకరించబోతున్నాడు.