Telugu Global
International

ప్రియాంక ఎదుట "మోడీ.. మోడీ" నినాదాలు.... ఆమె రియాక్షన్‌కు షాకైన మోడీ భక్తులు!

నెహ్రూ – గాంధీ వారసత్వపు రాజకీయాల్లో తాజా ఎంట్రీ ప్రియాంకా గాంధీ. దేశ ప్రజలకు ఆమె సోనియా, రాజీవ్ కుమార్తెగా.. రాహుల్ గాంధీ సోదరిగా ఎన్నేళ్ల నుంచో తెలుసు. అడపాదడపా తన తల్లి, సోదరుడి కోసం ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీలో మాత్రం తనకు ఎలాంటి హోదా లేదు. కానీ ఈసారి బలమైన మోడీని ఎదుర్కోబోతున్న కాంగ్రెస్ ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమించడమే కాక.. ఉత్తరప్రదేశ్‌లో […]

ప్రియాంక ఎదుట మోడీ.. మోడీ నినాదాలు.... ఆమె రియాక్షన్‌కు షాకైన మోడీ భక్తులు!
X

నెహ్రూ – గాంధీ వారసత్వపు రాజకీయాల్లో తాజా ఎంట్రీ ప్రియాంకా గాంధీ. దేశ ప్రజలకు ఆమె సోనియా, రాజీవ్ కుమార్తెగా.. రాహుల్ గాంధీ సోదరిగా ఎన్నేళ్ల నుంచో తెలుసు. అడపాదడపా తన తల్లి, సోదరుడి కోసం ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీలో మాత్రం తనకు ఎలాంటి హోదా లేదు. కానీ ఈసారి బలమైన మోడీని ఎదుర్కోబోతున్న కాంగ్రెస్ ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపింది.

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమించడమే కాక.. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఆనాటి నుంచి ఆమె తనదైన శైలిలో ప్రచారంలో దూసుకొని పోతున్నారు. అటు మోడీని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజీవ్ మీద చేసిన వ్యాఖ్యలకు కూడా ధీటైన సమాధానాలు ఇస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు.

కాగా, నిన్న ప్రియాంక గాంధీ తన ప్రచారాన్ని కొనసాగిస్తూ కారులో ప్రయాణిస్తుండగా ఒక ఘటన చోటు చేసుకుంది. ఆమె కారులో వెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు కొందరు ఆమె కారుకు ఎదురుగా ‘మోడీ.. మోడీ’ అంటూ నినాదాలు ఇచ్చారు. జై బీజేపీ జైజై నరేంద్ర మోడీ అంటూ.. కాంగ్రెస్ ముర్థాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వారిని ప్రియాంక తనదైన శైలిలో కట్టడి చేశారు.

అప్పటికప్పుడు కారు ఆపేసి.. వారి వద్దకు ప్రియాంక నడుచుకుంటూ వెళ్లారు. అందరికీ నవ్వుతూ కరచాలనం చేసి… ‘మీరు మీ పని చేస్తున్నారు.. నేను నా పని చేస్తున్నాను’ తప్పేం లేదంటూ మాట్లాడారు.

ఆమె మాటలకు అక్కడున్న బీజేపీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోవడమే కాక ఆమె వ్యక్తిత్వానికి ఫిదా అయ్యారు. వెంటనే అందరూ ఆమెతో సెల్ఫీలు దిగి.. ‘మేడం ఆల్ ద బెస్ట్’ అని ఆమెను అభినందించారు.

ఈ ఘటనను మొత్తం ప్రశాంత్ కుమార్ అనే జర్నలిస్టు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. బీజేపీ కార్యకర్తలను కూడా మంత్రముగ్దులను చేసుకున్న ప్రియాంక లౌక్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

First Published:  14 May 2019 3:03 AM GMT
Next Story