రష్మిక మందన్న నిర్ణయం ఇదేనా !

‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ‘గీతగోవిందం’ సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ ను అందుకున్న రష్మిక ఇప్పుడు టాలీవుడ్లో హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది.

అటు స్టార్ హీరోల నుంచి ఈ స్టార్ దర్శకుల వరకు అందరి కన్ను ప్రస్తుతం రష్మిక మీదే ఉంది. మళ్లీ విజయ్ దేవరకొండ హీరోగా ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించబోతోంది.భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా కాకుండా రష్మిక మందన్న నితిన్ సరసన ఒక సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు, అల్లు అర్జున్ తదుపరి సినిమాలలో కూడా హీరోయిన్ గా ఈమెను ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు కూడా ఈమె అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో చిన్న హీరోలతో సినిమాలు కాకుండా పెద్ద బడ్జెట్ సినిమాలలో నటించాలని రష్మికా మందన్న నిర్ణయించుకుందట.