‘అభిమన్యుడు-2’లో…. శ్రద్ధ శ్రీనాధ్

కన్నడ ‘యుటర్న్’ సినిమాతో పాపులర్ అయిన శ్రద్ధ శ్రీనాథ్ తమిళంలో కూడా సుపరిచితురాలే. ‘విక్రం వేద’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా లో నటించిన ఈ భామ ఈ మధ్యనే న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో ఈమె పేరు బాగానే వినిపిస్తోంది. ‘జెర్సీ’ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రద్ద శ్రీనాధ్ కు ఇప్పుడు ఒక క్రేజీ సినిమాలో ఆఫర్ రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

విశాల్ హీరోగా నటించిన ‘అభిమన్యుడు’ తమిళంలో, తెలుగులో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నారు దర్శక నిర్మాతలు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం శ్రద్ధా శ్రీనాధ్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. శ్రద్ధ శ్రీనాధ్ కూడా ఈ సినిమా ఒప్పుకున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

పి.ఎస్. మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో మాత్రమే కాక తెలుగు లో కూడా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా శ్రద్ధ శ్రీనాధ్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.