స్పానిష్ గ్రాండ్ ప్రీ విన్నర్ లూయి హామిల్టన్

  • సీజన్లో మూడో టైటిల్ నెగ్గిన ప్రపంచ చాంపియన్ 
  • కెరియర్ లో 76వ టైటిల్ విజేతగా స్టార్ రేసర్

2019 ఫార్ములావన్ సర్క్యూట్ లో…ప్రపంచ చాంపియన్ టీమ్ మెర్సిడెస్ టీమ్ హవా కొనసాగుతోంది. బార్సిలోనాలోని కాటలోనియా రేస్ ట్రాక్ లో ముగిసిన స్పానిష్ జీపీలో సైతం…మొదటి రెండు స్థానాలను టీమ్ మెర్సిడెస్ రేసర్లే సొంతం చేసుకొని తమ ఆధిక్యాన్ని చాటుకొన్నారు.

హోరాహోరీగా సాగిన ఈ చాంపియన్షిప్ రేస్ లో…టీమ్ మెర్సిడెస్ స్టార్ రేసర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ లూయి హామిల్టన్ విజేతగా నిలిచాడు. తనజట్టుకే చెందిన వాలెటెర్రీ బొట్టాస్ నుంచి అడగడుగునా గట్టి పోటీ ఎదుర్కొన్న హామిల్టన్ …తన నైపుణ్యాన్నంతా ప్రదర్శించి.. విజేతగా నిలిచాడు.

హామిల్టన్ కెరియర్ లో ఇది 76వ టైటిల్ కాగా..స్పానిష్ జీపీ గెలుచుకోడం ఇది నాలుగోసారి. అంతేకాదు…2017, 2018, 2019 సీజన్లలో టైటిల్స్ నెగ్గడం ద్వారా హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

రేస్ ప్రతిల్యాప్ లోనూ ఆధిక్యం కొనసాగించడం ద్వారా టైటిల్ నెగ్గడం హామిల్టన్ కెరియర్ లో ఇది 16వసారి కావడం విశేషం.
హామిల్టన్ మొత్తం 112 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.