డ్రగ్స్ కేసులో సినిమావాళ్ళంతా నిర్ధోషులే….

గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. కొన్ని వారాల పాటు చాలా ఆసక్తిగా, సంచలనాత్మకంగా సాగిన ఈ కేసు కొద్దిరోజులకే సద్దుమణిగి పోయింది.

అప్పట్లో సిట్ టాలీవుడ్ డ్రగ్ కేసులో నాలుగు చార్జిషీట్లను దాఖలు చేసింది. సిట్ అధికారులు దాఖలు చేసిన నాలుగు చార్జిషీట్లలో ఒకటి సౌతాఫ్రికా పౌరుడైన విక్టర్ పైన. అతను ముంబై నుండి హైదరాబాద్ కు కొకైన్ ని తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించి ఆగస్టు 2017 లో అతనిని అరెస్టు చేయడం జరిగింది.

ఆ చార్జిషీట్లలో 62 మంది పేర్లు నమోదై ఉన్నాయి. వారిలో చాలామంది ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సినీ నిర్మాతల పేర్లు కూడా ఉన్నాయట. ఈ విషయమై వారి గోర్లు, వెంట్రుకలు నమూనాలను సేకరించింది సిట్. కానీ చూస్తూ ఉంటే ఈ చార్జిషీట్లు కేవలం తూతూమంత్రంగా వేసినట్లు గానే అనిపిస్తున్నాయి. డ్రగ్ కేసులను నమోదు చేసిన సిట్ దాఖలైన చార్జిషీట్లలోని సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక అప్పట్లో టాలీవుడ్ లో కలకలం రేపిన ఈ డ్రగ్స్ కేసు ఇలా ముగిసింది అన్నమాట.