Telugu Global
Cinema & Entertainment

అది నా దురదృష్టం అనుకోవాలేమో " అల్లు శిరీష్

అల్లు శిరీష్ నుంచి ఓ సినిమా వచ్చిందంటే, నెక్ట్స్ సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో చెప్పలేం. సినిమా-సినిమాకు మధ్య అంత గ్యాప్ తీసుకుంటాడు ఈ హీరో. ఇదే విషయంపై శిరీష్ ను ప్రశ్నిస్తే అమాయకంగా ముఖం పెట్టాడు ఈ హీరో. తన కెరీర్ లో గ్యాప్స్ ఎందుకొస్తున్నాయో తనకు కూడా అర్థం కావడం లేదంటున్నాడు. “నా సినిమాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. అది నా దురదృష్టం అనుకోవాలేమో. ABCD సినిమాను గతేడాది జూన్ […]

అది నా దురదృష్టం అనుకోవాలేమో  అల్లు శిరీష్
X

అల్లు శిరీష్ నుంచి ఓ సినిమా వచ్చిందంటే, నెక్ట్స్ సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో చెప్పలేం. సినిమా-సినిమాకు మధ్య అంత గ్యాప్ తీసుకుంటాడు ఈ హీరో. ఇదే విషయంపై శిరీష్ ను ప్రశ్నిస్తే అమాయకంగా ముఖం పెట్టాడు ఈ హీరో. తన కెరీర్ లో గ్యాప్స్ ఎందుకొస్తున్నాయో తనకు కూడా అర్థం కావడం లేదంటున్నాడు.

“నా సినిమాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. అది నా దురదృష్టం అనుకోవాలేమో. ABCD సినిమాను గతేడాది జూన్ లో స్టార్ట్ చేశాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ లేట్ అయిపోయింది. నా వైపు నుంచి ఆలస్యం అనేది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు అడిగినా కాల్షీట్లు ఇస్తున్నాను. కానీ లేట్ అవుతున్నాయి.”

ఏపీసీడీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు శిరీష్. ఈసారి గ్యాప్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానంటున్నాడు. అంతేకాదు, ఈసారి గ్యాప్ రాకుండా ఉండేందుకు ఒకేసారి 2 సినిమాలు ఎనౌన్స్ చేస్తానంటున్నాడు.

“వచ్చే ఏడాది 2 సినిమాలు చేయాలనుకుంటున్నాను. వీటిలో ఒక సినిమా స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయింది. ఇదొక మంచి లవ్ స్టోరీ. దర్శకుడు ఎవరనే విషయాన్ని త్వరలోనే చెబుతాను. ఇక ఏబీసీడీ రిలీజ్ తర్వాత మరో సినిమా కూడా ఓకే చేస్తాను. ఆ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తాయి.”

నిజానికి అల్లు శిరీష్ కు డెసిషన్ మేకింగ్ లేదంటారు తెలిసినవాళ్లు. ఓ కథపై వెంటనే నిర్ణయం తీసుకోలేడని, అందుకే చాలా టైమ్ తీసుకుంటాడని చెబుతుంటారు. నిజానికి ఇదే వాస్తవం కూడా. ఈ సిండ్రోమ్ నుంచి శిరీష్ ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది.

First Published:  15 May 2019 10:00 AM GMT
Next Story