‘వీసా’ కష్టాలు తీరాయి… ఇక అంతా ‘సైలెన్స్’…!

‘భాగమతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత బరువు తగ్గే పనిలో పడ్డ టాలీవుడ్ స్వీటీ అనుష్క అప్పటినుంచి వెండి తెరపై కనిపించలేదు.

అయితే తాజాగా స్లిమ్ గా మారిపోయిన దేవసేన ‘సైలెన్స్’ అనే ఒక థ్రిల్లర్ సినిమాలో కనిపించబోతుందని వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా….. ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా మొదలవలేదు.

తాజాగా ఈ సినిమా గురించి ఒక క్లారిటీ వచ్చింది. మొన్నటిదాకా అనుష్క వీసా ప్రాబ్లమ్స్ వలన అమెరికా వెళ్లడం ఆలస్యమైందని అందుకే ఈ చిత్రం షెడ్యూల్ ను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

తాజాగా అనుష్క వీసాకి క్లియరెన్స్ రావడంతో త్వరలో ఈ సినిమా షూటింగ్ కోసం యూఎస్ బయలుదేరడానికి సిద్ధమవుతోంది. అక్కడ ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ ను చిత్రీకరించబోతున్నారు.

కొందరు హాలీవుడ్ నటీ నటులు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. హాలీవుడ్ నటుడు మైకేల్ మాడ్సన్, ఆర్ మాధవన్, సుబ్బరాజు, అంజలి, శాలిని పాండే, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.