విజయ్… ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’….

ఇటీవలే సోషల్ మీడియా లో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం డియర్ కామ్రేడ్ లో ని ఒక పాట విడుదల ని అనౌన్స్ చేస్తూ, ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అని తెగ పొగిడేసాడు.

సరిగా చెప్పిన టైం కి ఆ పాట సోషల్ మీడియా లో రావాల్సింది. కానీ కొన్ని అనుకోని కారణాల వలన పాట విడుదల ఆలస్యం అయింది. సినిమా ప్రమోషన్ లో భాగంగానే డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్, హీరో విజయ్ ఆ పాటను వాయిదా వేశారని, మరో తేదీని ప్రకటించారని చెబుతున్నారు.

అయితే రెండో సారి చెప్పిన విధం గా ఈ రోజు పాటని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ‘కడలల్లె’ అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో ఉంది.

వాన లో రష్మిక, విజయ్  రొమాన్స్ ని చక్కగా ఆవిష్కరించాడని దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. లిరికల్ వీడియో గా విడుదల అయిన ఈ పాట… హీరో హీరోయిన్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆవిష్కరించింది. చూడాలి దేవరకొండ చెప్పినట్టు ఈ పాట నిజంగా సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవుతుందో లేదో…!