Telugu Global
Cinema & Entertainment

రిస్క్.... లాభాలు తెచ్చిపెడుతోంది

మహేష్ ను నైజాం కింగ్ అని ఎందుకంటారో మరోసారి రుజువైంది. అతడు నటించిన మహర్షి సినిమా నైజాం ప్రాంతంలో రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన 6 రోజుల్లోనే ఈ సినిమాకు నైజాంలో 20 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ ఘనత సాధించింది మహర్షి సినిమా. ఈ ఫీట్ తో మహేష్ కు నైజాంలో తిరుగులేదనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. నైజాంలో 20 కోట్ల షేర్ రాబట్టడం మహేష్ కు అలవాటుగా […]

రిస్క్.... లాభాలు తెచ్చిపెడుతోంది
X

మహేష్ ను నైజాం కింగ్ అని ఎందుకంటారో మరోసారి రుజువైంది. అతడు నటించిన మహర్షి సినిమా నైజాం ప్రాంతంలో రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన 6 రోజుల్లోనే ఈ సినిమాకు నైజాంలో 20 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ ఘనత సాధించింది మహర్షి సినిమా. ఈ ఫీట్ తో మహేష్ కు నైజాంలో తిరుగులేదనే విషయం మరోసారి ప్రూవ్ అయింది.

నైజాంలో 20 కోట్ల షేర్ రాబట్టడం మహేష్ కు అలవాటుగా మారిపోయింది. అతడు నటించిన శ్రీమంతుడు సినిమా వారం రోజుల్లోపే 22 కోట్ల రూపాయలు రాబట్టింది. అటు భరత్ అనే నేను సినిమా కూడా వారం లోపే 21 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు మహర్షి సినిమా కేవలం 6 రోజుల్లోనే 20 కోట్లు క్రాస్ చేసింది. ఇవన్నీ నాన్-బాహుబలి రికార్డులే.

నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు పంపిణీ చేశారు. ఈ సినిమాకు నిర్మాత కూడా తనే కావడంతో కాస్త రిస్క్ తీసుకొని మరీ పంపిణీ చేశారు. ఆ రిస్కే ఇప్పుడు దిల్ రాజుకు లాభాలు తెచ్చిపెడుతోంది. నైజాంలో 20 కోట్ల రేషియోలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయగా.. 6 రోజుల్లోనే ఆ డబ్బులు వచ్చేశాయి. అంటే రేపట్నుంచి వచ్చే ప్రతి రూపాయి దిల్ రాజుకు లాభం కిందే లెక్క.

First Published:  15 May 2019 7:58 AM GMT
Next Story