దీదీ సంచలనం…. మోడీకి షాక్ ఇవ్వబోతున్నారా?

మోడీపై కక్షగట్టిన మమతా బెనర్జీ బీజేపీని బెంగాల్ లో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. అంతే ధీటుగా బీజేపీ స్పందిస్తూ బెంగాల్ ఎన్నికల్లో ఈడీ, ఐటీలతో తృణమూల్ నేతల పనిపడుతోంది. దీంతో బీజేపీ-తృణమూల్ మధ్యన బెంగాల్ లో పెద్ద యుద్ధమే సాగుతోంది.

మోడీతో ఢీ అంటే ఢీ అంటున్న మమతా..బీజేపీ బెంగాల్ లో దారుణాలు చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తన ప్రధాని కలను పక్కనపెట్టి అవసరమైతే రాహుల్ ను ప్రధాని చేయడానికి తాజాగా నిర్ణయం తీసుకున్నారని వార్తలొస్తున్నాయి.. మోడీ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ప్రధాని కావడానికి వీల్లేదని.. అందుకే తాను వైదొలిగి అవసరమైతే రాహుల్ ను ప్రధాని చేయడానికి అభ్యంతరం లేదని సంకేతాలు పంపినట్టు తెలిసింది.

మొన్న ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 21న ప్రాంతీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహిద్దామంటే మమత అడ్డుకున్నారు. ఫలితాలు వెలువడ్డాక ఎవరి బలం ఎంతనేది తేలాకే మీటింగ్ పెడుదామన్నారు. అత్యధిక సీట్లు వస్తే తానే ప్రధాని కావచ్చని మమత ఈ నిర్ణయం తీసుకున్నారు.

కానీ ఇప్పుడు బీజేపీ అరాచకాలు చూశాక దీదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రధాని కాకపోయినా ఫర్వాలేదు కానీ మోడీని కానివ్వనని నిర్ణయించారట. అందుకోసం రాహుల్ ను ప్రధాని చేయడానికి కూడా రెడీ అని సంకేతాలిచ్చారట.

ప్రస్తుతం డీఎంకే అధినేత స్టాలిన్ రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు మమత కూడా సపోర్ట్ చేయడంతో ఎస్పీ-బీఎస్పీ కూటమి బలం కీలకంగా ఉంటుంది. మాయావతి నిన్ననే మోడీపై విమర్శలు చేయడంతో వారు కూడా కాంగ్రెస్ వెంట నడవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫలితాల తర్వాత తక్కువ సీట్లతోనైనా కాంగ్రెస్ గద్దెనెక్కడం.. రాహుల్ ప్రధాని కావడం ఖాయమంటున్నారు.