Telugu Global
NEWS

మీరేమైనా చెప్పండి.... నా అభిప్రాయం ఇదే!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడం ఖాయమని మంత్రులు కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ 110 స్థానాలలో తెలుగుదేశం విజయం సాధ్యమని, మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మంత్రులకు వివరించినట్లు చెబుతున్నారు. ఈ లెక్కలకు తన వద్ద పక్కా సమాచారం ఉందని, ఇంటెలిజెన్స్ నివేదికలతో పాటు తాను […]

మీరేమైనా చెప్పండి.... నా అభిప్రాయం ఇదే!
X

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడం ఖాయమని మంత్రులు కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు.

ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ 110 స్థానాలలో తెలుగుదేశం విజయం సాధ్యమని, మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మంత్రులకు వివరించినట్లు చెబుతున్నారు. ఈ లెక్కలకు తన వద్ద పక్కా సమాచారం ఉందని, ఇంటెలిజెన్స్ నివేదికలతో పాటు తాను ప్రైవేటుగా చేయించిన వివిధ సంస్థల సర్వేలు కూడా ఇదే మాట చెబుతున్నాయని ముఖ్యమంత్రి మంత్రులకు వివరించినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి మాటలను కొంతసేపు విన్న మంత్రులు “మీ లెక్కల గురించి మాకు తెలియదు సార్. నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో వచ్చిన నివేదికల ఆధారంగా మనం అధికారంలోకి రావడం లేదని స్పష్టమవుతోంది ” అని ముఖ్యమంత్రి ఎదుటే చెప్పినట్లుగా విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని పదే పదే చెప్పడంతో ప్రజల్లో చులకన భావం వస్తుందని కూడా మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

సీనియర్ మంత్రులు యనమల రామక్రిష్ణుడుతో సహా మరో ముగ్గురు మంత్రులు మంత్రివర్గ సమావేశానికి రాకపోవడం వెనుక కూడా ఇదే కారణముందని మంత్రులు సీఎంకు వివరించినట్లు చెబుతున్నారు. పసుపు కుంకుమ పని చేసిందని మనం భావిస్తున్నాం కాని ఓటు వేసి వచ్చిన మహిళలు ఎవరికి వేశారమ్మా అంటే సమాధానం మాత్రం చెప్పలేదని మంత్రులు అన్నట్లు చెబుతున్నారు.

ఇది తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతకు సంకేతమని, స్ధానిక నాయకులు ఈ ఐదేళ్లలో చేసిన అవినీతిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు అన్నట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్రను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఇన్నాళ్లూ భావించామని, అయితే అక్కడ కూడా ఓటర్లు టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనపరిచారని మంత్రులు అన్నట్లు చెబుతున్నారు.

అయితే, మంత్రుల మాటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుతగిలి “మనం విజయం సాధించడం ఖాయం. నేను చెబుతున్నాను కదా… కంగారు పడకండి” అని పాత పాటనే మళ్లీ పాడినట్లుగా రాయలసీమకు చెందిన మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం కొసమెరుపు.

First Published:  14 May 2019 11:10 PM GMT
Next Story