రామ్ చరణ్ తో…. వంశీ పైడిపల్లి ?

వంశీ పైడిపల్లి ఇటీవలే మహేష్ బాబు తో మహర్షి సినిమా తీశాడు. అటు మహేష్ కెరీర్ లోనే భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాగా నిలిచింది.

ఇప్పుడు వంశీ మెగా కాంపౌండ్ లోకి దూకనున్నాడు అనే వార్తలు ఊపందుకున్నాయి. ఆల్రెడీ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం వంశీ ని అప్రోచ్ అయ్యాడన్న వార్తలు వస్తున్నాయి. వంశీ ఇంతకు ముందు రామ్ చరణ్ తో కలిసి ‘ఎవడు’ చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. 

ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలుస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే విచిత్రం ఏంటి అంటే, మహర్షి సినిమా కోసం వంశీ మూడేళ్లు ఎదురు చూశాడు. సినిమా హిట్ అయింది. కానీ తన తదుపరి సినిమాకి కూడా మరో రెండేళ్లు సమయం పట్టనుందని అంటున్నారు.

రామ్ చరణ్ రాజమౌళి తో చేసే సినిమా వచ్చే ఏడాది వేసవి కి విడుదల అవుతుంది. సినిమా అయ్యాక కొంచెం గాప్ తీసుకొని కానీ రామ్ చరణ్ కొత్త సినిమా ప్రారంభం చేయలేడు. అంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికే దాదాపు రెండేళ్ళు పట్టే అవకాశం ఉంది.