Telugu Global
NEWS

బాబుగారి దొంగ చూపులు

తెలుగుదేశం పార్టీ అధినేత ప్రత్యామ్నాయ చర్యల వైపు దృష్టి సారించారా? అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు ఉంటున్నాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అన్ని సర్వేలు చెబుతున్నట్టు రేపు వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ కనుక సీఎం అయితే తాము ఏం చేయాలో బాబు ఇప్పటి నుంచే చర్చలు కొనసాగిస్తున్నారని అంటున్నారు. ఇందుకోసం ఆయన తాజాగా తన సన్నిహితులతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అభిమానించే కొందరు ముఖ్యమైన […]

బాబుగారి దొంగ చూపులు
X

తెలుగుదేశం పార్టీ అధినేత ప్రత్యామ్నాయ చర్యల వైపు దృష్టి సారించారా? అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు ఉంటున్నాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అన్ని సర్వేలు చెబుతున్నట్టు రేపు వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ కనుక సీఎం అయితే తాము ఏం చేయాలో బాబు ఇప్పటి నుంచే చర్చలు కొనసాగిస్తున్నారని అంటున్నారు.

ఇందుకోసం ఆయన తాజాగా తన సన్నిహితులతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అభిమానించే కొందరు ముఖ్యమైన వ్యక్తులు ఈ సమావేశంలో పాలు పంచుకున్నారని చెబుతున్నారు. జగన్ కు ఎంపీ సీట్లు కూడా అధికంగానే వస్తే ఢిల్లీలో కూడా ఆయన కీలకం అవుతారని, అప్పుడు తమ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారని అంటున్నారు.

దీనికి కేసీఆర్ కూడా తోడైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండవచ్చని వ్యాఖ్యానించారని సమాచారం. దీనిని ఎదుర్కునేందుకు ఏం చేయాలో ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఒక రకంగా తాము అధికారానికి దూరమవుతున్నామనే టీడీపీ నేతలు నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ అధికారం చేపడితే యూపీఏలో కలిసిపోయి ఇబ్బందులను కొంత మేరకు అధిగమించే అవకాశం ఉందని భావించినట్టు సమాచారం.

ఒకవేళ వైసీపీ, టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపితే ఎలా అని కొందరు నేతలు ప్రశ్నించినట్టు తెలిసింది. ఒకే అలయెన్స్ గా ఉంటాం కాబట్టి అంతగా ఇబ్బందులు ఏమీ రాకపోవచ్చని చంద్రబాబు సమాధానమిచ్చారని అంటున్నారు.

అసలు అనవసరంగా బీజేపీతో కయ్యానికి దిగామని చంద్రబాబు ఇప్పటికే వేదన చెందుతున్నారని, ఒకవేళ కేంద్రంలో మళ్లీ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే వారితో కలిసేందుకు కూడా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

మోడీ కాకుండా ప్రధానిగా ఇంకెవరు అయినా మాకు ఓకే.. అనే సంకేతాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వైపు పంపించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే గత కొంత కాలంగా బాబు వ్యవహార శైలిని చూస్తున్న బీజేపీ అగ్ర నేతలు ఆయనను ఎంత వరకు విశ్వసిస్తారో అన్నది అనుమానమేనని అంటున్నారు.

మొత్తానికి ఎన్నికల తరువాత ఎలాంటి పరిణామాలు ఎదురైనా వాటిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారన్నది మాత్రం సుస్పష్టం అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

First Published:  15 May 2019 9:42 PM GMT
Next Story