‘బాస్ లేడీ’కి….. ఇస్మార్ట్ శంకర్ గిఫ్ట్

తెలుగులో నటిగా మంచి పేరు తెచ్చుకొని గత కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఛార్మి కౌర్ ప్రస్తుతం నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే.

పూరి కనెక్ట్స్ పతాకంపై చార్మి ఇప్పుడు హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కు నిర్మాతగా వ్యవహరిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా చార్మి ఈ శుక్రవారం తన పుట్టిన రోజు జరుపుకోనుంది. ఈ సందర్భంగా హీరో రామ్ తనకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చాడు.

“నా పుట్టిన రోజుకి ఒక్క రోజు ముందు నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గిఫ్ట్ ను రామ్ నాకు ఇచ్చాడు” అంటూ సోషల్ మీడియాలో గిఫ్ట్ ను పట్టుకుని ఉన్న ఫొటోని షేర్ చేసింది. అయితే ఆ గిఫ్టు లోపల ఏముందో తెలియదు కానీ దాని పైన రాసిన ఒక నోట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో ఛార్మిని బాస్ లేడీ గా పిలుస్తూ, “హ్యాపీ బర్త్ డే బాస్ లేడీ…. ఒక బాస్ లేడి తన వయసును లెక్కపెట్టుకోదు….. అనుభవాన్ని మాత్రమే లెక్కపెట్టుకుంటుంది” అని రాశాడు రామ్.