Telugu Global
NEWS

మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై వేసిన 175 పిటిషన్లను విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. రైతులు, రైతు కూలీలు, ఇతరులకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. కాళేశ్వరం ముంపు పరిధిలో ఉన్న ఏటిగడ్డ కిష్టాపూర్‌లో పనులు చేయరాదని గతంలోనే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై ప్రభుత్వం సవాల్ చేయగా.. కోర్టు విచారణ చేపట్టి కాళేశ్వరం […]

మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై వేసిన 175 పిటిషన్లను విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. రైతులు, రైతు కూలీలు, ఇతరులకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

కాళేశ్వరం ముంపు పరిధిలో ఉన్న ఏటిగడ్డ కిష్టాపూర్‌లో పనులు చేయరాదని గతంలోనే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై ప్రభుత్వం సవాల్ చేయగా.. కోర్టు విచారణ చేపట్టి కాళేశ్వరం పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరోవైపు మల్లన్నసాగర్‌పై దాఖలైన పిటిషన్లను కూడా హైకోర్టు విచారించింది. భూనిర్వాసితులు అనేక రోజులుగా ఆందోళన చేయడమే కాకుండా ప్రాజెక్టును ఆపాలని పిటిషన్లు వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వాన్ని కోరగా ఇవాళ ఏజీ సమాధానం ఇచ్చారు. మల్లన్నసాగర్ కోసం 4,108 ఎకరాలను సేకరించామని.. 4,061 ఎకరాల యజమానులు పరిహారం తీసుకున్నారని కేవలం 47 ఎకరాల రైతులు మాత్రం పరిహారం తీసుకోవడానికి నిరాకరించారని ఏజీ హైకోర్టుకు తెలిపారు.

47 ఎకరాల కోసం పనులు ఆపడం సాధ్యం కాదని…. ప్రాజెక్టు చివరి దశలో పనులు ఆపితే నష్టం వస్తుంది కనుక అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం ఆ 47 ఎకరాల నిర్వాసితుల చెక్కులను కోర్టులో డిపాజిట్ చేసింది. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

First Published:  16 May 2019 4:22 AM GMT
Next Story