వన్డే క్రికెట్లో మరో సరికొత్త ప్రపంచ రికార్డు

  • 36 సంవత్సరాల కపిల్ దేవ్ రికార్డు తెరమరుగు
  • కపిల్ రికార్డును అధిగమించిన పాక్ కెప్టెన్ ఇమాముల్ హక్ 
  • ఇంగ్లండ్ తో వన్డేలో ఇమాముల్ 151 పరుగులు

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే…సరికొత్త రికార్డు నమోదయ్యింది. జింబాబ్వే పై 36 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డును…పాకిస్థాన్ యువ కెప్టెన్ ఇమాముల్ హక్ అధిగమించాడు.ట్రెంట్ బ్రిడ్జ్ వెల్స్ వేదికగా జింబాబ్వేతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో భారత కెప్టెన్ గా కపిల్ దేవ్ 24 సంవత్సరాల వయసులో 175 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.

అత్యంత పిన్నవయసులో వన్డేల్లో 150కి పైగా స్కోరు సాధించిన కెప్టెన్ గా కపిల్ రికార్డు నెలకొల్పాడు. అయితే గత మూడున్నర దశాబ్దాలుగా.. చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డే ద్వారా అధిగమించాడు.

ఇమాముల్ 131 బాల్స్ లోనే 151 పరుగుల స్కోరు సాధించాడు. 23 సంవత్సరాల వయసులోనే ఇమామ్ ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

అత్యంత పిన్నవయసులో వన్డే క్రికెట్లో 150కి పైగా స్కోరు సాధించిన కెప్టెన్ గా రికార్డుల్లో చేరాడు.