మరొక హై బడ్జెట్ సినిమా లో కనిపించబోతున్న కాలకేయుడు

టాలీవుడ్ లో ఉన్న అతి తక్కువ మంది విలన్లలో మంచి పేరున్న నటుడు ప్రభాకర్. ‘మర్యాద రామన్న’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రభాకర్ ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుడు పాత్ర తో దేశమంతటా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

‘బాహుబలి’ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచిన ప్రభాకర్ కు బోలెడు భాషల నుంచి మంచి ఆఫర్లు లభిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ప్రభాకర్ కు ఒక పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.కన్నడ సినిమా ‘బిచ్చుగత్తి’ అనే సినిమాలో ప్రభాకర్ ఒక ముఖ్య పాత్ర చేయబోతున్నాడట. భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో రాజవర్ధన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

హరి సంతోష ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ కన్నడలో ‘బృందావన’, ‘గజకేసరి’, ‘లక్ష్మణ’, ‘చౌక’ సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించాడు. మరి ఈ సినిమా ప్రభాకర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.