సినిమాతో పైడిపల్లి …. యాడ్ తో కొరటాల…..

మహర్షి సినిమా విడుదల అయి…. అతి తక్కువ రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించి మహేష్ బాబు కెరీర్ లోనే ఇప్పటి వరకు వున్న రికార్డులు అన్నిటినీ దాటేసి కొత్త రికార్డు సృష్టించింది ఈ చిత్రం.

ఈ సినిమా దర్శకుడు వంశీ పైడపల్లి సినిమా విడుదల రోజు నుండి నేటి వరకు మహేష్ బాబు ని సరికొత్తగా చూపించినందుకు వంశీ పైడపల్లి పై వస్తున్న అభినందనలు అన్ని ఇన్ని కావు. మళ్లీ ఈ కాంబినేషన్ ఇంకొకసారి చూడాలనే ఉద్దేశాన్ని అభిమానులు కూడా సోషల్ మీడియా లో వ్యక్తపరుస్తున్నారు.

అయితే తాజా గా మహేష బాబు వంశీ పైడిపల్లి ని అందరూ ప్రశంసల తో ముంచేస్తున్న నేపధ్యం లో కొరటాల శివ మీద కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అది కూడా మహేష్ అభిమానుల నుండి కావడం విశేషం.

వివరాలలోకి వెళితే ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో అభి బస్ టికెట్ బుకింగ్ యాప్ కి సంబంధించిన అడ్వర్ టైజ్ మెంట్ కోసం మహేష్ బాబు వెన్నెల కిషోర్ కలిసి నటించారు. ఒక టెలివిజన్ ఛానల్ ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం అభి బస్ యాప్ యాడ్ అందరి మన్ననలు పొంది టాప్ పొజిషన్ లో వున్నట్టు తెలుస్తోంది. అందుకని కొరటాల శివ మీద కూడా మహేష్ అభిమానులు ప్రశంసలు వెదజల్లుతున్నారు.

ఇంతకు ముందు మహేష్ బాబు కొరటాల శివ కలిసి శ్రీమంతుడు, భరత్ అనే నేను అనే సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ కాగా ఇటీవల వచ్చిన మహర్షి కూడా శ్రీమంతుడు తో పోలి ఉందని విమర్శకులు సైతం అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో మహేష్ బాబు కొరటాల శివ మళ్లీ పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.