Telugu Global
Health & Life Style

నేరేడు.... ఆరోగ్యానికి నెలరేడు....

మనిషి ఆరోగ్యంగా జీవించడం కోసం ప్రకృతి ఇచ్చిన మరో అద్భుత ఫలం నేరేడు పండు. ఇది సాధారణంగా శీతకాలంలో దొరుకుతుంది. ఈ పండులో అనేక పోషకాలు ఉన్నాయి. నేరేడు పండుతో పాటు నేరేడు బెరడు, ఆకులలో కూడా అనేక వ్యాధులను నివారించే గుణాలు ఉన్నాయి. నేరేడు పండులో ఒక ప్రత్యేకత ఉంది. మనం తినే ఆహారంతో పాటు చిన్నచిన్న దారపు పోగులో లేక వెంట్రుకలు కడుపులోకి వెళతాయి. అవి లోపలికి వెళ్లి ప్రేగులకు చుట్టుకుంటాయి. ఈ నేరేడు […]

నేరేడు.... ఆరోగ్యానికి నెలరేడు....
X

మనిషి ఆరోగ్యంగా జీవించడం కోసం ప్రకృతి ఇచ్చిన మరో అద్భుత ఫలం నేరేడు పండు. ఇది సాధారణంగా శీతకాలంలో దొరుకుతుంది. ఈ పండులో అనేక పోషకాలు ఉన్నాయి. నేరేడు పండుతో పాటు నేరేడు బెరడు, ఆకులలో కూడా అనేక వ్యాధులను నివారించే గుణాలు ఉన్నాయి.

  • నేరేడు పండులో ఒక ప్రత్యేకత ఉంది. మనం తినే ఆహారంతో పాటు చిన్నచిన్న దారపు పోగులో లేక వెంట్రుకలు కడుపులోకి వెళతాయి. అవి లోపలికి వెళ్లి ప్రేగులకు చుట్టుకుంటాయి. ఈ నేరేడు పండు తినడం వల్ల ప్రేగులకు చుట్టుకున్న ఆ వెంట్రుకలను బయటకు పంపిస్తుంది.
  • నేరేడు ఆకులు ఎండబెట్టి పొడిచేసి దానికి తగినంత ఉప్పు కలుపుకుని పళ్లు తోముకుంటే చిగుళ్లు గట్టిపడి, దంత సమస్యలు తగ్గుతాయి.
  • నేరేడు పండులో రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ను అదపు చేసే గుణాలు ఉన్నాయి. అందవల్ల డయాబేటీస్ పేషేంట్లకు నేరేడు పండు ఎంతో మంచిది.
  • హై షుగర్ ఉన్నవారు నేరేడు గింజల పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • నేరేడులో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. అంతే కాదు కంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
  • ఇందులో ఉన్న విటమిన్ సి, ఐరన్ రక్తంలోఉన్న హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోకుండా కాపాడుతుంది.
  • కొంత మంది పిల్లలకు అంటే 10 లేక 12 సంవత్సరాలు వచ్చినప్పటికీ పక్క తడిపే అలవాటు ఉంటుంది, అటువంటప్పుడు నేరేడు గింజల పొడిని నీళ్లలో కలిపి ఒక నెల రోజులు తాగిస్తే ఫలితం కనిపిస్తుంది.
  • కిడ్నీలో ఉన్న రాళ్ళను నివారించే గుణాలు నేరేడు పండులో ఉన్నాయి.
  • తరచూ నేరేడు పండు తినడం వల్ల లివర్ శుభ్రపడుతుంది.
  • నేరేడు పండులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు అనేక రోగాలను నివారిస్తాయి.
  • నేరేడు పండు వల్ల ఎసిడిటీ, జీర్ణసమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది.
  • వికారం, కడుపులో తిప్పడం, ఎసిడిటీ, వాంతులు అరికట్టాలంటే ఓ నాలుగు లేక ఐదు నేరేడు పళ్లు తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  • దీని ఆకు కషాయంలో కొన్ని యాలకులు లేదా దాల్చిన చెక్కతో తీసుకుంటే చొంగ కార్చే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • నేరడు ఆకులు నూరి తేలు లేక ఇతర విషజంతులు కుట్టిన చోట పట్టు వేస్తే ఆ విషం హరించుకుపోతుంది.
  • నేరేడు పచ్చి గింజల కషాయం అతి మూత్రం, ప్లీహ రోగం నుంచి ఉపశమనం కలుగును. (enlargement of spleen)
  • నేరేడు పండులో రక్తపోటును నివారించే గుణాలు ఉన్నాయి.
First Published:  15 May 2019 10:45 PM GMT
Next Story