జగన్‌ కోసం…. తల నీలాలు ఇచ్చిన పృథ్వి

జగన్‌ ముఖ్యమంత్రి కావడంకోసం ఎప్పటినుంచో తీవ్రంగా కృషి చేస్తున్న సినీ నటుడు పృథ్వీ ఈరోజు తిరుమలలో…. ఏ ఆటంకాలూ లేకుండా జగన్‌ ముఖ్యమంత్రి కావడం కోసం వెంకన్నకు తన తల నీలాలను కానుకగా సమర్పించుకున్నాడు.

నిన్న కాలినడకన తిరుపతి వెళ్ళిన పృథ్వీ ఈరోజు శ్రీవారి సేవల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్‌లో బలహీన వర్గాల సంక్షేమం కోసం మంచి పాలన రావాలని కోరుకుంటూ…. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని తన తలనీలాలను సమర్పించినట్లు చెప్పారు.

దాదాపు సినీరంగమంతా చంద్రబాబు వెంట ఉన్నప్పుడు కూడా పృథ్వీ జగన్‌ వైపు నిలవడమే కాకుండా పోసాని కృష్ణ మురళీ లాగా ధైర్యం చేసి జగన్‌కు మద్ధతుగా నిలిచారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం రూపొందించిన అనేక ప్రచార కార్యక్రమాల్లో ఉచితంగా నటించి జగన్‌ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నిరకాల వత్తిళ్ళు వచ్చినా వెనకడుగు వేయలేదు.

జగన్‌ ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉన్నాడని… జగన్‌ ఎప్పుడూ ప్రజల మధ్యే ఉన్నాడని, పాదయాత్రలో జగన్‌ను దగ్గరగా చూసిన జనం…. జగన్‌ పై తెలుగుదేశం పార్టీ, మీడియా ప్రచారం చేసిన వార్తలు అబద్ధాలని జనం గ్రహించారని…. తెలుగు ప్రజలు జగన్‌ను నమ్మి ఓటేశారని…. టీడీపీ ఎన్ని తప్పుడు సర్వేలు బయటపెట్టినా టీడీపీలో ఎమ్మెల్యేలు కాదుకదా మంత్రులు కూడా ఒకళ్ళిద్దరు తప్ప… మిగిలిన వాళ్ళు గెలవరని…. జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని పృథ్వీ అన్నారు.