Telugu Global
NEWS

రవిప్రకాష్‌ నేరాల ఆధారాలను వెలికితీసిన పోలీసులు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఫోర్జరీ, నిధుల బదిలీ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు కావడంతో మే 9 నుంచి ఆయన బయట కనిపించకుండా పోయారు. పలు దఫాలు నోటీసులు జారీ చేసినా ఆయన పోలీసు విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయనకు 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసు ఇచ్చారు. దాని గడువు నిన్ననే ముగియడంతో ఆయనను ఏక్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏబీసీఎల్‌కు చెందిన షేర్లను రవిప్రకాష్… […]

రవిప్రకాష్‌ నేరాల ఆధారాలను వెలికితీసిన పోలీసులు
X

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఫోర్జరీ, నిధుల బదిలీ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు కావడంతో మే 9 నుంచి ఆయన బయట కనిపించకుండా పోయారు. పలు దఫాలు నోటీసులు జారీ చేసినా ఆయన పోలీసు విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయనకు 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసు ఇచ్చారు. దాని గడువు నిన్ననే ముగియడంతో ఆయనను ఏక్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.

మరోవైపు ఏబీసీఎల్‌కు చెందిన షేర్లను రవిప్రకాష్… శివాజీకి అమ్మినట్లు కుట్ర పూరితంగా ఒక డాక్యుమెంట్ స‌‌ృష్టించారు. ఏప్రిల్ 13న ఈ డాక్యుమెంట్ తయారు చేశారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 13న ఒప్పందం తయారు చేసి గతేడాది ఫిబ్రవరిలో ఒప్పందం జరిగినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు రవిప్రకాష్‌ బృందం. దీని ఫైనల్‌ డ్రాఫ్ట్‌ తయారు చేసింది విజయవాడకు చెందిన ఒక లాయర్‌.

అంతే కాకుండా ఈ విషయాలకు సంబంధించి శివాజీ, రవిప్రకాష్‌, శక్తి, ఫైనాన్స్‌ అధికారి మూర్తి, ఎంకేవీఎన్‌ మూర్తి, హరికిరణ్‌ అనే వ్యక్తుల మధ్య ఈ-మెయిల్ సంభాషణలు జరిగినట్టు పోలీసులు ఆధారాలను రాబట్టారు. ఈ సంభాషణల ఈ-మెయిల్స్‌ను ఇటీవల రవిప్రకాష్‌ బృందం డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రవిప్రకాష్‌ బృందం డిలీట్‌ చేసిన ఈ-మెయిల్స్‌ను సైబర్‌ క్రైం పోలీసుల విచారణలో ఫోరెన్సిక్‌ నిపుణలు కొత్త టెక్నాలజీని ఉపయోగించి రీట్రీవ్‌ చేశారు.

కొత్త యాజమాన్యాన్ని అడ్డుకునేందుకు రవిప్రకాష్‌…. శివాజీ చేత ట్రిబ్యునల్‌లో కేసు వేయించారు. సాధారణ వ్యక్తి ఎన్‌సీఎల్టీలో కేసు వేస్తే చెల్లదు కనుక…. రవిప్రకాష్‌ కు ఉన్న 40 లక్షల షేర్లలో 20 లక్షల షేర్లను శివాజీకి అమ్మినట్లు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు.

దీంతో తాను ఏబీసీఎల్‌లో వాటాదారుడినని.. తనకు తెలియకుండా కంపెనీని అమ్మేశారని శివాజీ పిర్యాదు చేశారు. నకిలీ పత్రాలతో ఎన్‌సీఎల్డీని ఆశ్రయించాడు శివాజీ. దీని వెనుక కుట్ర చేసింది రవిప్రకాషేనని పోలీసులు చెబుతున్నారు.

టీవీ9 సంస్థను నాశనం చేసేందుకు రవిప్రకాష్ కుట్ర చేయడం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. వీటిని మరింత లోతుగా విచారించేందుకు రవిప్రకాష్, శివాజీలను ప్రశ్నిద్దామని అనుకున్నా వారు మాత్రం ఎవరికీ దొరకట్లేదు. ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు.

రవిప్రకాష్‌ పదిరోజుల గుడువుకోరుతూ పోలీసులకు మెయిల్ పంపగా…. శివాజీ మాత్రం అనారోగ్యంతో విచారణకు హాజరుకాలేనని పోలీసులకు పంపిన మెయిల్‌ లో వివరణ ఇచ్చాడు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్టు చెప్పాడు. తాను ఎక్కడ ఉన్నది మాత్రం చెప్పలేదు శివాజీ.

First Published:  16 May 2019 2:21 AM GMT
Next Story