మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్న ‘ఆర్ ఆర్ ఆర్’ కొత్త షెడ్యూల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఇద్దరు హీరోలు గాయపడటంతో షూటింగ్ కి కొన్నాళ్లు బ్రేకులు పడిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కాబోతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ లోని కొత్త షెడ్యూల్ మే 21 నుండి మొదలవనుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉండబోతోంది. చెర్రీ సరసన అలియా భట్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం ఇంకా వెతుకులాట జరుగుతోంది.

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు సమూతిరఖని కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరంభీం పాత్రలో ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరించబోతున్నారు.