Telugu Global
Cinema & Entertainment

పైడిపల్లి ముందు హీరోలు క్యూ.... మళ్ళీ అదే బ్యానర్

మహర్షి విజయంతో మరోసారి పైడిపల్లి జాతకం మారిపోయింది. హీరోలంతా ఇప్పుడీ దర్శకుడితో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది నిర్మాతలు ఇప్పటికే ఫ్యాన్సీ ఆఫర్లు కూడా అందిస్తున్నారు. అలా అటు హీరోలు, ఇటు నిర్మాతలు వంశీ పైడిపల్లి కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వంశీ పైడిపల్లి మాత్రం తన నెక్ట్స్ మూవీని దిల్ రాజు బ్యానర్ లోనే చేయబోతున్నాడు. ఈ మేరకు చాన్నాళ్ల కిందటే వీళ్లిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. అంతేకాదు, ప్రస్తుతం […]

పైడిపల్లి ముందు హీరోలు క్యూ.... మళ్ళీ అదే బ్యానర్
X

మహర్షి విజయంతో మరోసారి పైడిపల్లి జాతకం మారిపోయింది. హీరోలంతా ఇప్పుడీ దర్శకుడితో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది నిర్మాతలు ఇప్పటికే ఫ్యాన్సీ ఆఫర్లు కూడా అందిస్తున్నారు. అలా అటు హీరోలు, ఇటు నిర్మాతలు వంశీ పైడిపల్లి కోసం వెయిట్ చేస్తున్నారు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వంశీ పైడిపల్లి మాత్రం తన నెక్ట్స్ మూవీని దిల్ రాజు బ్యానర్ లోనే చేయబోతున్నాడు. ఈ మేరకు చాన్నాళ్ల కిందటే వీళ్లిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. అంతేకాదు, ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ పనిమీద వంశీ పైడిపల్లి కొన్ని లైన్స్ కూడా రెడీ చేసుకుంటున్నాడు.

ఇక హీరోల విషయానికొస్తే, వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు రామ్ చరణ్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. గతంలో ఈ దర్శకుడితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది చరణ్ కు. కాబట్టి ఓపెన్ గానే చెప్పాడు. ఇక బన్నీ కూడా వంశీ పైడిపల్లి కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్లు మాత్రమే కాదు, వంశీతో మరోసారి వర్క్ చేయడానికి ఎప్పుడూ సిద్ధమని మహేష్ కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.

సో.. ప్రస్తుతానికైతే వంశీ పైడిపల్లికి హీరోలు, నిర్మాతలతో సమస్య లేదు. ఎటొచ్చి మంచి కథ మాత్రమే సెట్ అవ్వాలి. ఒక్కసారి స్టోరీలైన్ సెట్ అయితే, హీరో ఎవరనేది ఓ కొలిక్కి వస్తుంది.

First Published:  15 May 2019 8:30 PM GMT
Next Story