సమంతకు ఛాలెంజ్ విసిరిన అమల

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఏదో ఒక ఛాలెంజ్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ సెలబ్రిటీలు దాదాపు అన్ని ఛాలెంజ్ లలోనూ పాల్గొంటూనే ఉన్నారు. ఐస్ బకెట్ ఛాలెంజ్, స్వచ్ భారత్ ఛాలెంజ్, కికి చాలెంజ్ ఇలాంటివి సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపాయి.

ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారిన టాపిక్ రీడింగ్ ఇస్ గుడ్ చాలెంజ్. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వచ్చి ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

తాజాగా నాగార్జున భార్య మరియు ఒకప్పటి నటి అయిన అక్కినేని అమల ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసి స్టోరీస్ ఎట్ వర్క్ అనే పుస్తకాన్ని చదువుతానని తెలిపారు. అంతేకాక సమంత, ఉపాసన మరియు సుమంత్ వంటి సెలబ్రిటీలపై ఇదే ఛాలెంజ్ ను విసిరారు అమల.

ఇంకా ఈ ముగ్గురు ఆ ఛాలెంజ్ స్వీకరించాల్సి ఉంది. మరి వారు అమల ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఏవైనా పుస్తకం చదవడం మొదలు పెడతారో చూడాలి. ఇప్పటికే సెలబ్రిటీలలోని కొందరు పుస్తకాల పురుగులు ఛాలెంజ్ లను యాక్సెప్ట్ చేసేశారు.