డబ్బు తో ఛార్మి ని కొనలేరట

ఛార్మి కౌర్ ఇండస్ట్రీ లో ఒకప్పుడు ఊపు ఊపిన నటి. దాదాపుగా పెద్ద హీరోలందరి తో నటించిన ఛార్మి…. క్రమక్రమం గా నటిగా ఇండస్ట్రీ నుండి దూరం అయింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాణ భాగస్వామిగా సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

అయితే తన అభిమానులు, మీడియా ప్రతినిధులు ఎప్పటికప్పుడు ఛార్మి తిరిగి సినిమాలోకి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నప్పటికీ తను మాత్రం మాట దాటవేస్తుంది.

ఇటీవల ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ సందర్భంగా ఛార్మి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఛార్మిని సినిమాల్లో ఎందుకు నటించడం లేదని ప్రశ్నించగా…. ఛార్మి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

తనకి డబ్బులు ముఖ్యం కాదని… పాత్ర నచ్చటమే ముఖ్యం అని….. ఐటమ్ సాంగ్ ల కోసం కోట్లు గుమ్మరిస్తున్నా తను మాత్రం డబ్బుకి పడిపోయే మనిషిని కాదన్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగం పై తన ధ్యాస అంతా ఉందని చెప్పింది ఛార్మి.

పూరి జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ బిజినెస్ వ్యవహారాలు కూడా తనే దగ్గరుండి చూసుకుంటునట్లు తెలుస్తుంది. ఇటీవలే వచ్చిన టీజర్ కి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ సినిమా హిట్ అవుతుందని ఛార్మి చెప్పింది.