మహర్షి…. ఇంకా 35 కోట్లు కావాలి

మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మహర్షి సినిమా. ఇప్పటివరకు ఈ హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా భరత్ అనే నేను సినిమా నిలిచింది. ఆ సినిమాకు 3 వారాల్లో 230 కోట్ల రూపాయల గ్రాస్ వస్తే, మహర్షి సినిమా వారం రోజుల్లోనే ఆ అంకెను దాటేసింది. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇక షేర్ పరంగా చూసుకుంటే.. తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో 58 కోట్ల 27 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ షేర్ విలువ అక్షరాలా 75 కోట్ల రూపాయలు. మరో వారం రోజుల పాటు మహర్షి హవా కొనసాగుతుందని భావిస్తున్నారు.

ఈ సినిమాను వరల్డ్ వైడ్ 110 కోట్ల రూపాయలకు అమ్మారు. ప్రస్తుతం వచ్చిన వసూళ్లు బట్టి చూసుకుంటే బ్రేక్ -ఈవెన్ అవ్వడానికి సినిమాకు ఇంకా 35 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 21.25 కోట్లు
సీడెడ్ – రూ. 6.90 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 7.47 కోట్లు
ఈస్ట్ – రూ. 5.54 కోట్లు
వెస్ట్ – రూ. 4.33 కోట్లు
గుంటూరు – రూ. 6.43 కోట్లు
నెల్లూరు – రూ. 2.08 కోట్లు
కృష్ణా – రూ. 4.28 కోట్లు