Telugu Global
Health & Life Style

అనాసపండు.... ఆరోగ్యం మెండు....

అనాసపండు…. మంచి సువాసనే కాదు మంచి రుచిగా కూడా ఉంటుంది. దీని వాసనకు వెంటనే ఎట్రాక్ట్ అయి తినాలనిపిస్తుంది. దీన్ని నేరుగా తిన్నా లేదా సలాడ్స్ లో తిన్నా, దీని జ్యూస్ తాగినా కూడా మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనాస పండులో ఔషధ గుణాల గురించి తెల్సుకుందాం. అనాస కాలేయానికి, మూత్రపిండాలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న ఔషధ గుణాలు మూత్రపిండాలలో రాళ్లను కరిగించడమే కాక…. కాలేయానికి మేలు చేస్తాయి. అనాస పండులో […]

అనాసపండు.... ఆరోగ్యం మెండు....
X

అనాసపండు…. మంచి సువాసనే కాదు మంచి రుచిగా కూడా ఉంటుంది. దీని వాసనకు వెంటనే ఎట్రాక్ట్ అయి తినాలనిపిస్తుంది. దీన్ని నేరుగా తిన్నా లేదా సలాడ్స్ లో తిన్నా, దీని జ్యూస్ తాగినా కూడా మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనాస పండులో ఔషధ గుణాల గురించి తెల్సుకుందాం.

  • అనాస కాలేయానికి, మూత్రపిండాలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న ఔషధ గుణాలు మూత్రపిండాలలో రాళ్లను కరిగించడమే కాక…. కాలేయానికి మేలు చేస్తాయి.
  • అనాస పండులో విటమిన్ సి అధికంగా ఉంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఇది స్త్రీ, పురుషుల సంతాన సాఫల్యానికి తోడ్పడుతుంది.
  • శరీరంపై ఉన్న మృతకణాలను నివారించి, వయస్సును తెలియకుండా చేస్తుంది.
  • ప్రతిరోజూ పైనాపిల్ జ్యూస్ లేదా సలాడ్ తినే వారు ఎంతో ఆరోగ్యంగాను, ఉల్లాసంగాను ఉంటారు.
  • శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి మనసును ఉత్తేజపరుస్తుంది.
  • అనాసలో ఉన్న కాపర్ శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాలను వృద్ది చేయడానికి సహాయపడుతుంది.
  • ఇందులో ఉన్న పొటాషియం లెవెల్స్ రక్త ప్రవాహం సాఫీగా సాగేందుకు సహాయపడుతుంది. దీని వల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది.
  • వొత్తిడి, డిప్రేషన్ తో బాధపడుతున్న వారు ఒక గ్లాసు పైన్ యాపిల్ జ్యూస్ తాగితే వాటినుండి తాత్కాలిక ఉపశమనం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • గొంతు గరగరలాడడం, గొంతు నొప్పి, గొంతు నస వంటి వాటికి అనాస రసం నోట్లో పోసుకుని పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • నోటి పూతతో బాధపడేవారు అనాస రసాన్ని పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
  • ఒక అనాసపండులో దాదాపు 60 నుండి 70 శాతం మాంగనీస్ ఉంటుంది. దీని వల్ల ఎముకలు, దంతాలు, కండరాలు, జుట్టు, దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
  • ఇందులో ఉన్న ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

హెచ్చరిక: గర్భణీలు, గుండె జబ్బులున్నవారు, షుగర్ పెషెంట్స్ ఈ పండును తీసుకోకూడదు.

First Published:  16 May 2019 9:04 PM GMT
Next Story