Telugu Global
Cinema & Entertainment

దేవిశ్రీకి వ్యతిరేకంగా పోస్ట్.... లైక్ కొట్టిన తమన్

ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్ తెలుగు లో ఉన్న టాప్ మోస్ట్ సంగీత దర్శకులలో ఒక్కడిగా ఉండేవాడు. తను అందించిన దాదాపు అన్ని ఆల్బమ్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కానీ గత కొంతకాలంగా దేవిశ్రీప్రసాద్ సంగీతం పై విమర్శలు వినిపిస్తున్నాయి. రాక్ స్టార్ ర్ సంగీతంలో కొత్తదనం ఉండటం లేదని కొందరు వేలెత్తి చూపిస్తున్నారు. తాజాగా మహర్షి ‘సినిమా’ సంగీతం పైన కూడా అలాంటి కామెంట్లే వచ్చాయి. ‘ఇదే కదా’ మరియు ‘పదరా పదరా’ పాటలు […]

దేవిశ్రీకి వ్యతిరేకంగా పోస్ట్.... లైక్ కొట్టిన తమన్
X

ఒకప్పుడు దేవి శ్రీ ప్రసాద్ తెలుగు లో ఉన్న టాప్ మోస్ట్ సంగీత దర్శకులలో ఒక్కడిగా ఉండేవాడు. తను అందించిన దాదాపు అన్ని ఆల్బమ్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కానీ గత కొంతకాలంగా దేవిశ్రీప్రసాద్ సంగీతం పై విమర్శలు వినిపిస్తున్నాయి. రాక్ స్టార్ ర్ సంగీతంలో కొత్తదనం ఉండటం లేదని కొందరు వేలెత్తి చూపిస్తున్నారు.

తాజాగా మహర్షి ‘సినిమా’ సంగీతం పైన కూడా అలాంటి కామెంట్లే వచ్చాయి. ‘ఇదే కదా’ మరియు ‘పదరా పదరా’ పాటలు తప్ప ఈ సినిమాలో మిగతా ఏ పాటలు బాగా లేవని…. పైగా దాదాపు అన్ని పాటలు ‘శ్రీమంతుడు’ సినిమా లోని పాటల లాగే ఉన్నాయని విమర్శలు విసురుతున్నారు.

ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ ‘మహర్షి’ సినిమా దర్శకనిర్మాతలు దేవి శ్రీ ప్రసాద్ ని కాకుండా తమన్ లేదా మణిశర్మ ని ఎంపిక చేసి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్ అలవాట్లో పొరపాటుగా ఆ కామెంట్ ను లైక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డం ఎంజాయ్ చేస్తున్నాడు తమన్. డి.ఎస్.పి కి వ్యతిరేకంగా ఉన్న ఆ పోస్ట్ ని లైక్ చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది.

అది తెలిసి చేశాడా…. తెలియకుండా చేశాడో కానీ తాను కూడా ఒక సంగీత దర్శకుడు అయ్యుండి వేరొకరిపై వచ్చిన హేట్ మెసేజ్ ను లైక్ చేయడం మాత్రం బాగా లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

First Published:  17 May 2019 1:43 AM GMT
Next Story