మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా….. విజయ్ దేవరకొండ

ఎట్టకేలకు టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజిన్ 2018 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టును విడుదల చేసింది. ‘సంజు’, ‘రాజి’, ‘ఉరి’ వంటి సినిమాలలో నటించిన విక్కీ కౌశల్ మొదటి స్థానాన్ని ఆక్రమించుకొని మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా మారాడు.

ప్రముఖ ఫూట్ బాలర్ ప్రాథమేశ్ మౌలింకర్ రెండవ స్థానాన్ని పొందగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

అయితే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం నాలుగో స్థానం పొందిన టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో నాలుగో స్థానాన్ని సంపాదించాడు విజయ్.

విజయ్ దేవరకొండ తరువాత ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదవ స్థానంలో నిలిచాడు.

అంతేకాక విద్యుత్ జంవల్, హ్రితిక్ రోషన్, కార్తిక్ ఆర్యన్, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు కూడా ఈ లిస్టులో చోటు సంపాదించుకున్నారు.

ఏదేమైనా విజయ్ దేవరకొండ మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం తలదన్ని ఒకవైపు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకోవడమే కాక మరో వైపు ఇలాంటి సత్కారాలతో కూడా ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇక సినిమాల పరంగా చూస్తే విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా జూలైలో విడుదల కానుంది.